Tuesday, December 3, 2024

Accident: యువ‌తిని ఢీకొన్న ట్యాంక‌ర్ … ఆర్టీసీ బ‌స్సు కింద ప‌డి మృతి

వాటర్ ట్యాంకర్ వెనక నుంచి ఢీకొట్టినా.. ప్రాణాలతో బయటపడిన ఆ స్కూటీ యువతి.. ఆ పక్కనే వస్తున్న ఆర్టీసీ బస్సు కింద పడి చనిపోవటం చూస్తుంటే.. విధి ఎలా ఆడుతుంది.. విధిరాతను ఎవరూ తప్పించలేరు అనిపిస్తుంది. ఓ వాహన ప్రమాదం నుంచి తప్పించుకున్న ఆ యువతి.. మరో వాహనం కింద పడి చనిపోవటం.. మిగతా వాహనదారులను సైతం విస్మయానికి, ఆవేదనకు గురి చేసింది. ఈ ఘ‌ట‌న భ‌ర‌త్‌న‌గ‌ర్ ఫ్లై ఓవ‌ర్ పై చోటుచేసుకుంది.

వాటర్‌ ట్యాంక్‌ ఢీ కొట్టడంతో స్కూటీపై వెళ్తున్న ఓ యువతి కింద పడిపోయింది. ఆ సమయంలో ఆర్టీసీ బస్సు ఆమె నుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందింది. కూకట్ పల్లిలో నివాసం ఉంటూ.. ఎర్రగడ్డలోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేసుకుంటున్న యువతి.. తన స్కూటీపై.. గురువారం ఉదయం డ్యూటీకి వెళుతుంది. కూకట్ పల్లి నుంచి వెళుతూ భరత్ నగర్ ఫ్లై ఓవర్ ఎక్కింది. ఆ సమయంలో ఆ యువతి స్కూటీని.. వెనక నుంచి వాటర్ ట్యాంకర్ ఢీకొట్టింది. అప్పటికీ ఏమీ కాలేదు.. ట్యాంకర్ ఢీకొట్టిన సమయంలో రోడ్డుపై పడిపోయింది.. అదే సమయంలో ఆ పక్కనే వస్తున్న ఆర్టీసీ బస్సు.. ఆ యువతి పైనుంచి వెళ్లింది. స్పాట్ లోనే చనిపోయింది ఆ యువతి. ఆ యువతిది శ్రీశైలంకు చెందిన సునీత(26) గా పోలీసులు గుర్తించారు. ఉద్యోగం కోసం.. బతుకుదెరువు కోసం హైదరాబాద్ వచ్చింది. కూకట్ పల్లిలో నివాసం ఉంటుంది. ఘటనా స్థలానికి చేరుకున్న సనత్ నగర్ పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement