Monday, April 29, 2024

గోల్డ్ డ్రాప్ తో పసందైన రంజాన్ విందు.. మితేష్‌ లోహియా

రంజాన్ పండుగ‌కు గోల్డ్ డ్రాప్ తో ప‌సందైన విందు చేసుకోవ‌చ్చ‌ని గోల్డ్‌ డ్రాప్‌, సేల్స్‌ అండ్‌ మార్కెటింగ్‌, డైరెక్టర్‌ మితేష్‌ లోహియా అన్నారు. ముస్లింలకు అత్యంత పవిత్రమైన రంజాన్‌ మాసం చివరి వారం వచ్చేసింది. ప్రార్థన, సమాజం కోసం సమయం కేటాయించడానికీ ఇది సమయం. అంతేకాదు, ఉపవాసాలు ఆ ఉపవాస ముగింపు వేళ బంధువులు, స్నేహితులతో విందును ఆస్వాదించడం… వినూత్నమైన సీజన్‌గా ఇది నిలుస్తుంటుంది. దక్షిణ భారతదేశంలో అత్యంత వైవిధ్యమైన ముస్లిం సమాజం ఉంటుంది. ఇది మహోన్నతమైన కలినరీ సంప్రదాయాలను ఈ సమయంలో చూపుతుంటుంది. దక్షిణ భారతదేశంలో రంజాన్‌ చివరి మాసంలో ఇఫ్తార్‌ విందు సంప్రదాయం అధికంగా కనబడుతుంది. సూర్యాస్తమయం ప్రార్థనలు ముగిసిన తరువాత ముస్లింలు ఈ విందు చేసుకుంటుంటారు.

ఈ భోజనాలు సాధారణంగా ఖర్జూరం ఆరగించడంతో ప్రారంభమై నీరు లేదా జ్యూస్‌ తీసుకోవడం చేస్తారు. ఆ తరువాత విస్తృత శ్రేణి రుచులు, స్వీట్లు తింటారు. సాధారణంగా అవి ఆ ప్రాంతంలో అత్యంత ప్రాచుర్యం పొందినవే అయి ఉంటాయి. ఈసంద‌ర్భంగా మితేష్ లోహియా మాట్లాడుతూ.. దక్షిణ భారతదేశంలో అత్యంత ప్రాచుర్యం పొందిన అలాంటి డిషెస్‌లో సమోసా ఒకటన్నారు. కూరగాయలు లేదా మాంసం వంటి వాటితో నింపబడిన ఈ త్రికోణాకారపు పేస్ట్రీని పుదీనా చట్నీ లేదా చింతపండు సాస్‌తో కలిపి సర్వ్‌ చేస్తుంటారన్నారు. ఇక ఇఫ్తార్‌ విందులో కనిపించే మరో అంశం బిర్యానీ అన్నారు. సాధారణంగా మటన్‌ లేదా చికెన్‌, వెజిటేబుల్స్‌తో తయారుచేసే ఈ బిర్యానీని రైతాతో కలిపి సర్వ్‌ చేస్తారన్నారు. తియ్యందనాలను కోరుకునే వారికి ఫిర్నీ, షీర్మాల్‌ వంటివి ఉంటాయన్నారు. ఈ వంట‌ల‌కు గోల్డ్ డ్రాప్ ఆయిల్ వాడితే మ‌రింత రుచిక‌రంగా ఉంటాయ‌ని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement