Friday, May 3, 2024

Rain – చిటపట చినుకులతో కూల్ కూల్ గా భాగ్యనగరం

 ఉక్కబోతతో ఉక్కిరిబిక్కిరవుతున్న హైదరాబాద్‌ నగర వాసులకు కాస్త ఊరట లభించించింది. నగరంలోని పలుకోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తున్నది. రాజేంద్రనగర్‌, తుర్కయంజాల్‌, కొత్తపేట, సరూర్‌నగర్‌, నాగోల్‌, చైతన్యపురి, చంపాపేట, సైదాబాద్‌, శంషాబాద్‌, ఆదిబట్ల, చార్మినార్‌, నాంపల్లి, మలక్‌పేట్‌, దిల్‌సుఖ్‌నగర్‌, వనస్థలిపురం, హయత్‌నగర్‌, అబ్దుల్లాపూర్‌మెట్‌, కాచిగూడ, ముషీరాబాద్‌, ఆర్టీసీ క్రాస్‌ రోడ్స్‌, అశోక్‌నగర్‌, బాగ్లింగంపల్లి, రాంనగర్‌, అడిక్‌మెట్‌, ఖైరతాబాద్‌, లక్టీకపూల్‌, తార్నాక, ఓయూ క్యాంపస్‌, హబ్సిగూడ, నాచారం, మల్లాపూర్‌, ఉప్పల్‌, నారాయణగూడ, హిమాయత్‌నగర్‌, లిబర్టీ, బషీర్‌బాగ్‌, లంగర్‌హౌస్‌, కార్వాన్‌, బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, పంజాగుట్ట, మెహదీపట్నం, మాసబ్‌ట్యాంక్‌ , మాదాపూర్‌, బడంగ్‌పేట, జల్‌పల్లిలో వర్షం కురుస్తున్నది. దీంతో నగరమంతా ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది.

ఆకాశం మేఘావృతమై ఉన్నది. శనివారం ఉదయం నుంచి చల్లని గాలులు వీస్తుండటంతో పొద్దున 7 గంటల నుంచే సూర్యుని సెగలతోపాటు వడగాల్పులతో సతమతమవుతున్న నగర ప్రజలు ఊపిరిపీల్చుకుంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement