Friday, May 10, 2024

మూడు నెల‌లు రేష‌న్ తీసుకోకుంటే తెల్ల రేష‌న్ కార్డు ర‌ద్దు….

హైద‌రాబాద్ : వ‌రుస‌గా మూడు నెల‌లు రేష‌న్ తీసుకోక‌పోతే అటోమెటిక్ గా తెల్ల రేష‌న్ కార్డు ర‌ద్దు అవుతుంద‌ని మంత్రి గంగుల క‌మ‌లాక‌ర్ తేల్చి చెప్పారు. శాస‌న‌స‌భ‌లో ప్ర‌శ్నోత్త‌రాల సంద‌ర్భంగా బీపీఎల్ కుటుంబాల‌కు తెల్ల రేష‌న్ కార్డుల జారీపై స‌భ్యులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు మంత్రి స‌మాధానం ఇస్తూ, . తెల్ల రేష‌న్ కార్డుల కోసం 9,41,641 ద‌ర‌ఖాస్తులు వ‌చ్చాయ‌ని, ఇందులో 3,59,974 మందికి ఆహార భ‌ద్ర‌తా కార్డులు జారీ చేశామ‌న్నారు. 92 వేల ద‌ర‌ఖాస్తులను తిర‌స్క‌రించామ‌ని, 4,88,775 కార్డుల ద‌ర‌ఖాస్తులు ప్రాసెస్‌లో ఉన్నాయ‌ని తెలిపారు. ఆహార భ‌ద్ర‌తా కార్డుల జారీ నిరంత‌ర ప్ర‌క్రియ అని స్ప‌ష్టం చేశారు. కొత్త రేష‌న్ కార్డులు ఇచ్చే అంశం ప్ర‌భుత్వ ప‌రిశీల‌న‌లో ఉంద‌న్నారు. క‌రోనా కార‌ణంగానే కొత్త కార్డుల‌ను జారీ చేయ‌లేక‌పోయామ‌ని మంత్రి స్ప‌ష్టం చేశారు. పెండింగ్ ద‌ర‌ఖాస్తుల‌ను త్వ‌ర‌లోనే వెరిఫై చేసి ప్ర‌తి ఒక్క అర్హుడికి తెల్ల రేష‌న్ కార్డుల‌ను జారీ చేస్తామ‌న్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement