Monday, December 11, 2023

Metro Brands: ఫర్ పీపుల్ హు మూవ్ క్యాంపెయిన్ ను ప్రారంభించిన మెట్రో బ్రాండ్స్ లిమిటెడ్

హైదరాబాద్ : మెట్రో బ్రాండ్స్ లిమిటెడ్ తమ బ్రిటీష్ ఫుట్ వేర్ బ్రాండ్ ఫిట్ ఫ్లాప్ కోసం ఫర్ పీపుల్ హు మూవ్ అనే సరికొత్త క్యాంపెయిన్ ను ప్రారంభించింది. ఈ క్యాంపెయిన్ ఆయా ఫీల్డ్‌లలోని ఉన్న నిజమైన గేమ్-ఛేంజర్‌లను హైలెట్ చేస్తుంది. అంటే వారు వచ్చే సమయానికి ఉన్న యథాతథ స్థితి ఒప్పుకోకుండా కొత్త మార్గాన్ని అన్వేషిస్తారు. ఈసందర్భంగా మెట్రో బ్రాండ్స్ లిమిటెడ్‌ మార్కెటింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ దీపికా దీప్తి మాట్లాడుతూ… ఫర్ పీపుల్ హూ మూవ్ క్యాంపెయిన్ ద్వారా ప్రపంచాన్ని అసాధారణ మార్గాల్లో ముందుకు నడిపించి, సరిహద్దులను చెరిపేసిన ఐకాన్‌ల కథలను వివరించాలనుకుంటున్నట్లు తెలిపారు.

- Advertisement -
   

ఈ క్యాంపెయిన్ ప్రజలను కదిలించడానికి, వారికున్న పరిమితులను సవాలు చేయడానికి, కొత్త మార్గాలను రూపొందించడానికి స్ఫూర్తినిస్తుందని తాము ఆశిస్తున్నామన్నారు. మీరు ధైర్యంగా తెర వెనుకకు వెళ్లినా, అన్ని అసమానతలను ధిక్కరించినా, ముఖ్యమైన సంభాషణలను నడిపించినా లేదా వారసత్వాన్ని కాపాడుకున్నా, ఫిట్ ఫ్లాప్ మీకు సౌకర్యాన్ని, శైలిని సజావుగా మిళితం చేసే పాదరక్షలను అందిస్తుందన్నారు. ఫిట్ ఫ్లాప్ ఫుట్ వేర్ రేంజ్ ఫ్యాషన్ ఫార్వర్డ్ మాత్రమే కాకుండా నిరంతరం శ్రమించే వారికి సౌకర్యాన్ని అందించేందుకు రూపొందించబడిందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement