Thursday, May 2, 2024

HYD: డోజీతో కలిసి స్మార్ట్‌కేర్ మెడికవర్ కార్యక్రమాన్ని పరిచయం చేసిన మెడికవర్ హాస్పిటల్స్

హైదరాబాద్ : భారతదేశంతో సహా 12 దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న గ్లోబల్ హెల్త్‌కేర్ పవర్‌హౌస్ అయిన మెడికవర్ హాస్పిటల్, డోజీ యొక్క అత్యాధునిక రిమోట్ పేషెంట్ మానిటరింగ్ టెక్నాలజీని ఏకీకృతం చేయడం ద్వారా పేషెంట్ కేర్‌లో సంచలనాత్మకమైన ప్రయత్నంగా స్మార్ట్‌కేర్ మెడికవర్ కార్యక్రమంను ప్రారంభించినట్లు సగర్వంగా ప్రకటించింది. ఈసందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ అనిల్ కృష్ణ మాట్లాడుతూ… ఆరోగ్య సంరక్షణలో అగ్రగామిగా తమ నిబద్ధత చికిత్సకు మించి విస్తరించిందన్నారు. ఇది రోగి సంరక్షణను పునర్నిర్వచించే ఆవిష్కరణల అసాధారణ అన్వేషణను కలిగి ఉంటుందన్నారు. డోజీ రిమోట్ పేషెంట్ మానిటరింగ్ టెక్నాలజీని స్వీకరించడం ఆరోగ్య సంరక్షణ భవిష్యత్తును రూపొందించడంలో తమ అంకితభావానికి నిదర్శనమన్నారు.

మెడికవర్ హాస్పిటల్స్‌ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అండ్ సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ ఎ శరత్ రెడ్డి మాట్లాడుతూ… కార్డియాలజీ రంగంలో సమయానుకూలంగా, ఖచ్చితమైన పర్యవేక్షణ చాలా ముఖ్యమైనదన్నారు. డోజీ రిమోట్ హెల్త్ మానిటరింగ్ సిస్టమ్ ముఖ్యమైన వైటల్స్ నిరంతర ట్రాకింగ్‌ని అనుమతిస్తుందన్నారు. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీహరి కృష్ణ మాట్లాడుతూ.. స్మార్ట్‌కేర్ మెడికవర్ అనేది హెల్త్‌కేర్ ఆవిష్కరణలో ముందుండాలనే తమ నిబద్ధతకు నిదర్శనమన్నారు.

గ్రూప్ మెడికల్ డైరెక్టర్ డా. సతీష్ కుమార్ మాట్లాడుతూ… మెడికవర్ లో తాము చేసే ప్రతి పనిలోనూ ఆవిష్కరణ అత్యంత కీలకంగా ఉంటుందన్నారు. స్మార్ట్‌కేర్ మెడికవర్ అనేది హెల్త్‌కేర్‌కి సంబంధించి ఒక సంపూర్ణమైన విధానమన్నారు. డోజీ సీఈఓ అండ్ సహ-వ్యవస్థాపకుడు ముదిత్ దండ్‌వతె మాట్లాడుతూ.. మెడికవర్ హాస్పిటల్‌తో తమ భాగస్వామ్యం ద్వారా రోగుల భద్రత పరంగా మార్గనిర్దేశం చేయడానికి తాము సంతోషిస్తున్నామన్నారు. రోగి భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ రిమోట్ పేషెంట్ మానిటరింగ్ టెక్నాలజీని స్వీకరించడం ఒక పెద్ద ముందడుగు అన్నారు. ఆరోగ్య సంరక్షణను మెరుగుపరిచే సాధనాలను అందించడం ద్వారా సంరక్షణ ప్రమాణాలు మెరుగు పరచటం తమ లక్ష్యమన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement