Wednesday, May 1, 2024

HYD: కలుషిత నీటి సరఫరాను అరికట్టేందుకు చర్యలు.. రజిత పరమేశ్వర్ రెడ్డి

ఉప్పల్ డివిజన్ లోని చర్చి కాలనీలో కలుషిత నీటి సరఫరాను అరికట్టేందుకు చర్యలు తీసుకోనున్నట్టుగా కార్పొరేటర్ మందుముల రజితపరమేశ్వర్ రెడ్డి తెలిపారు. కాలనీల్లో కలుషిత జలాల సరఫరాపై కార్పొరేటర్ రజితపరమేశ్వర్ రెడ్డి సీరియస్ గా తీసుకున్నారు. గురువారం రజిత పరమేశ్వర్ రెడ్డి, ఈఈ నాగేందర్, డీఈ నిఖిల్ రెడ్డి, వాటర్ వర్క్స్ అధికారులు అసిఫ్, శానిటేషన్ సూపర్ వైజర్ రాజేశ్వర్ రెడ్డితో కలిసి లక్ష్మీనారాయణ కాలనీలో పర్యటించారు. కలుషిత జలాలు సరఫరా అవుతున్న కాలనీల్లో పర్యటించారు. వెంటనే కలుషిత జలాలను గుర్తించే (QIWPS) మిషన్ ను తెప్పించి పరీక్షలు చేయించారు.

కలుషిత జలాల సరఫరా కాకుండా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా అధికారులకు సూచించారు. మరో సారి ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. చర్చి కాలనీలోని అంగన్వాడీ కేంద్రం పుష్పల్లమ్మ ఇంటి సమీపంలో ఉన్న డ్రైనేజీ సమస్యను కూడా పరిశీలించారు. ఈ సమస్యను సైతం వెంటనే పరిష్కారం అయ్యేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో చర్చి కాలనీ అధ్యక్షులు పోలిశెట్టి సుధాకర్, జ్ఞానపాల్ రెడ్డి, సతీష్, మర్రి రెడ్డి, వినోద్, కాటా భాస్కర్, అలెగ్జాండర్, మర్నేని భాస్కర్, సమియల్, మర్నేని రాయన్న, డేవిడ్, థామస్ ఇన్షామ్మ, సుమలత, మేరీ, మార్తం ఉపేందర్ రెడ్డి, సందీప్, భాస్కర్ పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement