Thursday, May 9, 2024

HYD: ఆ అంబేద్కర్ విగ్రహాన్ని చూడు రేవంత్ రెడ్డీ.. జ్ఞానోదయం అవుతుంది.. దాసోజు శ్రవణ్

సీఎం కేసీఆర్ పై ఓర్వలేని మనస్తత్వంతో రేవంత్ రెడ్డి విషం కక్కుతున్నాడని, ఒక్కసారి ఆ అంబేద్కర్ విగ్రహాన్ని చూడు జ్ఞానోదయం అవుతుందని బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ ట్వీట్ చేశారు. ఒక్కసారి కళ్ళు విప్పి వెనక్కి తిరిగి చూడు, ఆకాశాన్ని అంటుతున్న డా అంబెడ్కర్ విగ్రహం కనబడుతుందన్నారు. తెలంగాణాలో కెసిఆర్ నేతృత్వంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమంకు నిలువెత్తు సాక్ష్యంగా అంబేద్కర్ విగ్రహం నిలబడ్డదన్నారు.

అజ్ఞాన అహంకారంతో కళ్ళు పూడుకుపోయిన తమరికి జ్ఞానోదయం అవుతుందన్నారు. అంతేకాదు, ఆ ఆకాశమంత ఎత్తులో ఉన్న డా అంబేద్కర్ ని చూశాక అయినా మరగుజ్జు మనస్తత్వంతో అడ్డగోలు ఆరోపణలు చేయడం మానుకోగలరని దాసోజు శ్రవణ్ కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement