Saturday, May 4, 2024

‘రంగం’లో భవిష్యవాణి వినిపించిన స్వర్ణలత.. ఏం చెప్పారంటే?

సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల్లో కీలక ఘట్టమైన రంగం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా జోగిని స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. గత ఏడాది కరోనా వల్ల పూజలు, బోనాలు సరిగా జరిపించలేకపోయామన్న పూజారులు… ఈసారి బాగానే జరిపించామన్నారు. దీనిపై స్పందించిన అమ్మవారు… కష్టమైనా తనకు పూజలు జరిపించినందుకు సంతోషంగా ఉన్నానన్నారు. కరోనాను తరిమేయాలని పూజారులు కోరగా… భక్తులను సంతోషంగా ఉండేలా చూసుకుంటానన్నారు. కష్టాల నుంచి కాపాడతానని, ఆశీర్వాదం ఇస్తున్నట్లు చెప్పారు.

వర్షాల వల్ల ప్రజలకు కొన్ని ఇబ్బందులు తప్పవన్న అమ్మవారు… ప్రజలు ధైర్యంగా ఉండాలన్నారు. తాను ప్రజల వెంట ఉండి నడిపిస్తానని, నిరాశ చెందవద్దన్నారు. ఎంత పెద్ద ఆపద వచ్చినా… నేను చూసుకుంటానన్న అమ్మవారు ఎలాంటి పరిస్థితుల్లోనూ భక్తులు ఆధైర్యపడవద్దని చెప్పారు. ఇలా అమ్మవారు సంతోషంగా ఉన్నట్లు భవిష్యవాణి చెప్పడంతో భక్తులు ఎంతో సంతోషించారు.

ఈ వార్త కూడా చదవండి: తెలంగాణలో కొత్తగా ఆరు విమానాశ్రయాలు

Advertisement

తాజా వార్తలు

Advertisement