Saturday, May 18, 2024

హైదరాబాద్‌లో ఐటీపీ ఏరో కొత్త కార్యాలయం ప్రారంభం..

హైదరాబాద్‌, ప్రభన్యూస్ : ప్రపంచంలోని ప్రముఖ ఎయిర్‌క్రాప్ట్‌ ఇంజిన్‌, విడిభాగాల తయారీ సంస్థ ఐటీపీ ఏరో హైదరాబాద్‌లో వారి కొత్త కార్యాలయాన్ని ప్రారంభించినట్లు ప్రకటించింది. హైదరాబాద్‌లోని ఐడీఏ గాంధీనగర్‌లో కంపెనీ నూతన కార్యాలయ స్థలాన్ని తెలంగాణ ప్రభుత్వ ఏరోస్పేస్‌, డిఫెన్స్‌ డైరెక్టర్‌ ప్రవీణ్‌ పీఏ, ఐటీపీ ఎక్స్‌టర్నల్స్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ జీసస్‌ కాటలీనా, ఐటీపీ ఎక్స్‌ టెర్నల్స్‌ ఇండియా మేనేజింగ్‌ డైరెక్టర్‌ వంశీ వికాస్‌, ఐటీపీ ఏరో ఇండస్ట్రీయల్‌ డెవలప్‌మెంట్‌ హెడ్‌ ఇనిగో సెపాస్‌ ఒడ్రియోజోలా సమక్షంలో ప్రారంభించారు.

ఈసందర్భంగా ఐటీపీ ఎక్స్‌టర్నల్స్‌ ఎండీ జీసస్‌ కాటలీనా మాట్లాడుతూ… ఐటీపీటీపీ ఎక్స్‌ టర్నల్స్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ ద్వారా భారత దేశంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నారన్నారు. ఇది హైదరాబాదులో 160మందికి పైగా సిబ్బందిని కలిగి ఉందన్నారు. ప్రవీణ్‌ మాట్లాడుతూ… విమానయాన రంగానికి హబ్‌గా హైదరాబాద్‌ తనని తాను సుస్థిరం చేసుకుందన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement