Monday, April 29, 2024

డ్రోన్స్ తో కొత్త వ‌ర్ట్యువ‌ల్ ప్ర‌యోగించ‌డం గొప్ప గౌర‌వం : జ‌య‌ప్ర‌కాష్

డ్రోన్స్ ని ఉపయోగించి అత్యంత కొత్త వర్ట్యువల్ ప్రయోగం నిర్వహించడం త‌న జీవితంలో అతి గొప్ప గౌరవమ‌ని ఏరోస్పేస్ స్థాపకులు, సీఈఓ అగ్నీశ్వర్ జయప్రకాష్ అన్నారు. గరుడా ఏరోస్పేస్ కిసాన్ డ్రోన్ తయారీ సదుపాయాల్ని ఆరంభించిన ప్రధాని, 100 భారతదేశపు గ్రామాల్లో కిసాన్ డ్రోన్ యాత్రని జెండా ఊపి ఆరంభించారు. ఈసంద‌ర్భంగా జ‌య‌ప్ర‌కాష్ మాట్లాడుతూ… 2021లో డ్రోన్ నియమాల్ని సరళీకరించిన ప్రభుత్వం డ్రోన్ శక్తి పై ప్రధానమైన విధాన నిర్ణయాలతో ఆత్మనిర్భార్ భారత్ ని స్థిరంగా ప్రోత్సహిస్తోందని, విదేశీ డ్రోన్స్ దిగుమతిని నిషేధించిందని ప్రధాన మంత్రి అన్నారన్నారు.

గరుడా ఏరోస్పేస్ రాబోయే 2 ఏళ్లల్లో 1,00,000 మేక్ ఇన్ ఇండియా డ్రోన్స్ ని తయారు చేసి, 2.5 లక్షలు మంది నైపుణ్యమున్న యువతకి నేరుగా నియామకానికి, పరోక్షంగా ఉపాధి కల్పించాలని భావిస్తోందన్నారు. డ్రోన్స్ ని ఉపయోగించి అత్యంత కొత్త వర్ట్యువల్ ప్రయోగం నిర్వహించడం త‌న జీవితంలో అతి గొప్ప గౌరవం కాగా, భారతదేశానికి ఆదర్శప్రాయులు, త‌న హీరో మోడీ సమక్షంలో ప్రయోగం జరగడం అది త‌నకు మరింత ప్రత్యేకని అన్నారు. ప్రధాన మంత్రి త‌మ డ్రోన్ సదుపాయాల్ని ప్రారంభించడం భారతదేశంలోనే 1వ డ్రోన్ యూనికార్న్ స్టార్టప్ గా అవాలని కోరుకునే గరుడా కలని ప్రోత్సహిస్తుందన్నారు. ఇది 6 లక్షలు డ్రోన్స్ ని తయారు చేస్తుందన్నారు. 2025 నాటికి భారతదేశంలోని ప్రతి గ్రామంలో 1 డ్రోన్ ఏర్పాటు చేస్తుందని పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement