Thursday, May 2, 2024

HYD: గ్రామీణ్‌ మహోత్సవ్‌ ను ప్రారంభించిన హ్యుందాయ్‌ మోటార్‌ ఇండియా

హైదరాబాద్ : హ్యుందాయ్‌ మోటార్‌ ఇండియా లిమిటెడ్‌ (హెచ్‌ఎంఐఎల్‌), గ్రామీణ భారతదేశంలో తమ కార్యకలాపాలను మరింత విస్తృతం చేయాలనే లక్ష్య సాకార దిశగా తమ ప్రయాణం ప్రారంభించింది. దేశంలోని ప్రతి మూలలో ఉన్న వినియోగదారుల విభిన్న అవసరాలను గుర్తిస్తూ, హ్యుందాయ్‌ మోటర్‌ ఇండియా గ్రామీణ్‌ మహోత్సవ్‌ ను సగర్వంగా పరిచయం చేసింది.

ఈసందర్భంగా హ్యుందాయ్‌ మోటర్‌ ఇండియా లిమిటెడ్‌ సిఒఒ తరుణ్‌ గార్గ్‌ మాట్లాడుతూ…. గ్రామీణ ప్రాంత ప్రజలతో తమ బంధాన్ని పెంపొందించడానికి తమ నిరంతర ప్రయత్నాలు అపూర్వ ఫలితాలను ఇస్తున్నాయన్నారు. హ్యుందాయ్‌ మోటర్‌ ఇండియా 2023 -2024 ఆర్థిక సంవత్సరంలో గ్రామీణ మార్కెట్లలో గణనీయమైన వృద్ధిని సాధించిందన్నారు. తాము గత సంవత్సరం గ్రామీణ భారతదేశంలో 1.15 లక్షల వాహనాలను విక్రయించామని, తద్వారా 2022-23 కంటే 11శాతం వృద్ధిని నమోదు చేసామన్నారు.

హ్యుందాయ్‌ మోటర్‌ ఇండియా వద్ద దేశం అభివృద్ధి చెందాలంటే, భారత్‌, ఇండియా రెండూ సమష్టిగా పురోగమించాలని తాము గట్టిగా నమ్ముతున్నామన్నారు. గ్రామీణ మహోత్సవ్‌ వంటి కార్యక్రమాలతో, దేశంలోని ప్రతి ప్రాంతంలోని తమ కస్టమర్‌లను ప్రోత్సహించాలని, వారి అంచనాలను అందుకోవటానికి మార్కెట్‌ టెడ్‌లను కూడా అర్థం చేసుకోవాలని తాము ఆశిస్తున్నామన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement