Tuesday, July 23, 2024

Kalki 2898 AD లేటెస్ట్ అప్డేట్.. స‌మ‌యం వ‌చ్చింది అంటూ..

దేశవ్యాప్తంగా మూవీ లవర్స్ ఎదురుచూస్తున్న పాన్ ఇండియన్ సినిమాలలో ‘కల్కి 2898 AD’ ఒకటి. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ మూవీనుంచి తాజాగా ఓ ఆసక్తికరమైన అప్డేట్ ఇచ్చారు మేక‌ర్స్. ‘కల్కి 2898 AD’లో బిగ్ బీ అమితాబ్ బచ్చన్ పాత్ర గురించి రివీల్ చేసే సమయం వచ్చేసందంటూ ఒక స్పెషల్ పోస్టర్‌ను విడుదల చేసింది మూవీ టీమ్.

రేపు (ఏప్రిల్ 21న) సాయంత్రం 7.15 నిమిషాలకు స్టార్ స్పోర్ట్స్ ఇండియా ఛానెల్‌లో ఎక్స్‌క్లూజివ్‌గా అమితాబ్ బచ్చన్ పాత్ర గురించి రివీల్ చేస్తామని ప్రకటించింది. ఇక‌ వైజయంతీ బ్యానర్‌ లో అశ్వినిదత్ ‘కల్కి 2898 AD’ను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. దిశా పటానీ, కమల్ హాసన్ వంటి వారు కూడా ఇందులో కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement