Thursday, May 2, 2024

ముఖ్యమంత్రిగా కేసీఆర్ కు హ్యాట్రిక్ విజయం తథ్యం.. కేటీఆర్

ఎల్బీనగర్, ఆగస్టు 2 (ప్రభ న్యూస్) : అభివృద్ధి, సంక్షేమం, పనిచేసే ప్రభుత్వాన్ని ప్రజలు వదులుకోరనేది తన విశ్వాసమని, రానున్న ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ హ్యాట్రిక్ విజయం సాధించి దక్షిణ భారతదేశంలో చరిత్ర సృష్టిస్తారని ఐటీ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఎల్బీనగర్ నియోజకవర్గంలో 118 జీవో కింద గృహ నిర్మాణదారులకు కన్వేయన్స్ డిడ్ పంపిణీ కార్యక్రమం ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవి రెడ్డి సుధీర్ రెడ్డి అధ్యక్షతన బుధవారం వనస్థలిపురం డివిజన్ జిఎస్ఆర్ గార్డెన్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ… మన నగరం కార్యక్రమంలో ప్రజలకు ఇచ్చిన హామీలో భాగంగా ఎల్బీనగర్ లోని సుమారు 18వేల కుటుంబాలకు ప్రత్యేక జీవో ద్వారా న్యాయం చేసామన్నారు. 58, 59 జీవో తో 11 వేలకు పైగా పట్టాలు అందించామన్నారు. జిహెచ్ఎంసి పరిధిలో నిరుపేదలకు ఒక లక్ష రెండు పడక గదులు నిర్మించామని, ఆగస్టు 15 నుండి అక్టోబర్ చివరి వరకు నియోజకవర్గానికి 4000 చొప్పున లబ్ధిదారులకు అందించనున్నట్లు తెలిపారు.

సొంత స్థలాల్లోనే ఇల్లు కట్టుకునే వారికి గృహలక్ష్మి పథకం ద్వారా రూ.3లక్షలు అందిస్తామన్నారు. నాగోల్ నుండి ఎల్బీనగర్ కు తక్షణమే మెట్రోను పొడగిస్తామన్నారు. ఎల్బీనగర్ నుంచి పెద్ద అంబర్పేట్ వరకు, హుస్నాపూర్ నుండి పెద్ద అంబర్పేట్ వరకు ఓఆర్ చుట్టూ 159 కిలోమీటర్ల మెట్రోను విస్తరిస్తామన్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణను ముఖ్యమంత్రి కేసీఆర్ తలసరి ఆదాయంలో దేశంలోనే అగ్రస్థానంలో నిలిపారని కొనియాడారు. పేదలకు మెరుగైన వైద్యం అందించేందుకు నగరం నలుమూలల నాలుగు సూపర్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులను 2వేల పడకల సామర్థ్యంతో నిర్మిస్తున్నామని, జిల్లాకు ఒక మెడికల్ కాలేజీని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. నగర మూసి మీద 14 కొత్త బ్రిడ్జిల నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయని, త్వరలో నాగోల్ మూసి పైన కూడా బ్రిడ్జి నిర్మాణాన్ని త్వరలో ప్రారంభిస్తామన్నారు. పనిచేసే ప్రభుత్వానికి ప్రజలు మద్దతు పలకాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి మేయర్ గద్వాల విజయలక్ష్మి కమిషనర్ రోనాల్డ్ రోస్ ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి, ఎమ్మెల్సీలు ఎగ్గేమల్లేశం బుగ్గారపు దయానంద్ గుప్తా రాచకొండ కమిషనర్ డిఎస్ చౌహన్, డీసీపీ సాయి శ్రీ గౌడ్, తదితరులున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement