Wednesday, May 1, 2024

హ్యాపీ బర్త్ డే ధనుష్ : ఐఎండీబీలో అత్యధిక రేటింగ్‌ ఉన్న ధనుష్‌ టాప్‌ 11 సినిమాలు ఇవే

హైదరాబాద్‌ : ధనుష్‌ గా సుపరిచితుడైన వెంకటేష్‌ ప్రభు కస్తూరి రాజా త్వరలో 40వ వసంతంలోకి అడుగు పెట్టనున్నాడు. తమిళ, హిందీ చిత్ర పరిశ్రమల్లో బహుముఖ ప్రజ్ఞాశాలి ధనుష్‌. ఆయన కేవలం నటు-డిగానే కాకుండా నిర్మాతగా, గేయ రచయితగా, నేపథ్య గాయకుడిగా కూడా పనిచేశారు. దాదాపు రెండు దశాబ్దాల క్రితం 2002లో ధనుష్‌ తన సోదరుడు కె.సెల్వరాఘవన్‌ దర్శకత్వం వహించిన తుల్లువధో ఇలమై అనే టీనేజ్‌ డ్రామాతో వెండితెర అరంగేట్రం చేశారు.

అప్పటి నుండి ఈ నటుడు పుదు పెటై, తిరువిలైయదళ్‌ ఆరంభం, కాదల్‌ కొండేన్‌, అసురన్‌, ఆడుకలం వంటి అనేక బాక్సాఫీస్‌ విజయాల్లో ప్రధాన పాత్రల్లో నటించాడు. ఆడుకలం, అసురన్‌ సినిమాల్లోని నటనకు వరుసగా 58, 67వ జాతీయ చలన చిత్ర అవార్డుల్లో ఉత్తమ నటు-డిగా అవార్డులు లభించాయి. ఆనంద్‌ ఎల్‌ రాయ్‌ దర్శకత్వం వహించిన రాంజానా చిత్రంతో హిందీ చిత్ర పరిశ్రమకు పరిచయమైన ఈ నటు-డు ఈ ఏడాది ప్రారంభంలో దీనికి సీక్వెల్‌ ప్రకటించారు.

- Advertisement -

ఐఎండీబీ ప్రకారం ధనుష్‌ టాప్‌ 11 అత్యధిక రేటింగ్‌ పొందిన సినిమాల జాబితా ఇదే..

1) పుదు పెటై – 8.5
2) అసురన్‌ – 8.4
3) వడ చెన్నై – 8.4
4) ఆడుకలం – 8.1
5) కర్ణన్‌ – 8
6) కాదల్‌ కొండేన్‌ – 8
7) తిరుచిత్రబలం – 7.9
8) వేలైయిల్లా పట్టతారి- 7.8
9) పోల్లధవన్‌ – 7.7
10) మాయక్కం ఎన్న – 7.7
11) రాంజనా – 7.6

Advertisement

తాజా వార్తలు

Advertisement