Friday, May 10, 2024

కార్పోరేట్‌ ప్రాంగణాల్లో డైవర్శిటీ, ఇన్‌క్లూజన్‌పై గుడ్‌ యూనివర్శ్ స‌ద‌స్సు

గుడ్‌ యూనివర్శ్‌ సంస్ధ మాదాపూర్‌లోని బ్లూమ్‌ హోటల్‌లో డీ అండ్‌ ఐ డైలాగ్‌ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ సదస్సులో బ్రిటీష్‌ డిప్యూటీ హై కమిషనర్‌, హైదరాబాద్‌ డాక్టర్‌ ఆండ్రూ ఫ్లెమింగ్‌, శరత్‌ సిటీ మాల్‌ సీఓఓ ఇంద్రనీల్‌ మజుందార్‌, నోవార్టిస్‌ డీ అండ్‌ ఐ గ్లోబల్‌ హెడ్‌ అపర్ణ పాఠక్‌, డీ అండ్ ఐ, సీఎస్‌ఆర్‌ డైరెక్టర్‌ నేహా గుప్తా, ఎల్‌జీబీటీ ఈఆర్‌జీ లీడ్‌ హర్ష రవితో పాటుగా పలు కార్పోరేట్‌ సంస్ధల ప్రతినిధిలు, డైవర్శిటీ అండ్‌ ఇన్‌క్లూజన్‌ హెడ్స్‌ తదితరులు పాల్గొన్నారు. బ్రిటీష్‌ డిప్యూటీ హై కమిషనర్‌ – హైదరాబాద్‌ డాక్టర్‌ ఆండ్రూ ఫ్లెమింగ్‌ కీలకోపన్యాసంతో ప్రారంభమైంది. డీ అండ్‌ ఐ ఆవశ్యకతను ఆయన వెల్లడించారు.

ఎల్‌జీబీటీ ప్ల‌స్ అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు తాము దేశవ్యాప్తంగా ప్రారంభించిన కార్యక్రమాలు 450కు పైగా గ్రూప్స్‌కు చేరువైందన్నారు. తెలుగు రాష్ట్రాల్లో తాము పలు క్వీర్‌ ఉద్యమకారులు, సంస్ధలతో కలిసి పనిచేస్తున్నామంటూ ఇక్కడ ఇంకా చేసేందుకు చాలా అవకాశముందన్నారు. అనంతరం డైవర్శిటీ అండ్‌ ఇన్‌క్లూజన్‌పై ఓ చర్చా కార్యక్రమం జరిగింది. దీనిలో నోవార్టిస్‌ డీ అండ్‌ ఐ గ్లోబల్‌ హెడ్‌ అపర్ణ పాఠక్‌ తో పాటుగా హర్ష రవికుమార్‌, తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా గుడ్‌ యూనివర్శ్‌ ప్రచురించిన కాఫీ టేబుల్‌ బుక్‌ను ఆర్‌కెమ్‌ ఫార్మా –వీపీ కార్పోరేట్‌ ఎఫైర్స్‌, సీఎస్‌ఆర్‌ రవి కుమార్‌ పీసపాటి, స్టేట్‌ స్ట్రీట్‌ వీపీ హరీష్‌, నిమ్స్‌లో సీనియర్‌ మెడికో సోషల్‌ వర్కర్‌ పార్వతి గుజ్జారీ, శరత్‌ సిటీ సీఓఓ ఇంద్రనీల్‌ విడుదల చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement