Saturday, May 4, 2024

HYD: ఇచ్చిన చెక్కులను వెంటనే ఖాతాలో వేసుకోండి..మాజీ మంత్రి సబితా

మహేశ్వరం అర్బన్, జనవరి 6(ప్రభ న్యూస్): మహేశ్వరం నియోజకవర్గంలోనే 16 వేల మందికి కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల అందించడం జరిగిందని,మహేశ్వరం మండల పరిధిలో 60 మందికి మంజూరైన కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు అందిస్తున్న‌ట్లు మాజీ మంత్రి,ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. శనివారం మహేశ్వరం మండల పరిషత్ సర్వసభ్య సమావేశం మందిరంలో ఎంపీపీ సునీత అంధ్యానాయక్ అధ్యక్షతన చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రా రెడ్డి పాల్గొని చెక్కులను అందజేశారు. మహేశ్వరం మండలానికి సంభందించిన 32 మంది లబ్దిదారులకు, తుక్కుగూడ మునిసిపాలిటీకి చెందిన 28 మందికి సుమారు 60 లక్షల పై చిలుకు నిధుల చెక్కులను అందించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ ఆడబిడ్డ పెళ్ళికి మేన మామ లాగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ మానవీయ కోణంలో కళ్యాణాలక్ష్మి, షాది ముబారక్ పథకం ప్రవేశపెట్టారని పేర్కొన్నారు.గతంలోనే మంజూరు అయిన కోడ్ రావటంతో ఆగిన చెక్కుల పంపిణీని నేడు చేపడుతున్నట్లు వెంటనే ఖాతాల్లో జమ చేసుకోవాలన్నారు. ఏడున్నర ఏళ్లలో మహేశ్వరం మండలం లో 2345 మందికి 20 కోట్ల 65 లక్షల 75 వేల రూపాయలు ఈ పథకం కింద అందించినట్లు తెలిపారు.

ఎలాంటి మధ్యవర్తిత్వం లేకుండా కుల,మత,ప్రాంత,రాజకీయాలతో సంభంధం లేకుండా నేరుగా లబ్దిదారులకు అందించినట్లు తెలిపారు.16 వేల మందికి మహేశ్వరం నియోజకవర్గములో అందించటం ఎంతో సంతోషంగా ఉందన్నారు,మానవీయ కోణంలో ఆలోచించి, దూర దృష్టితో పేదింటి ఆడబిడ్డల వివాహాలకు ఈ పథకం కేసీఆర్ శ్రీకారం చుట్టారన్నారు.తద్వారా సమాజంలో భారీగా మార్పులు వచ్చాయన్నారు. బాల్య వివాహాలు పూర్తిగా తగ్గిపోగా,యూనివర్సిటీ లు అమ్మాయిలతో నిండాయన్నారు. కాకతీయ,ఉస్మానియా, తెలంగాణ, యూనివర్సిటీ లు 70 నుంచి 80 శాతం వరకు పూర్తిగా అమ్మాయిలతో నిండిపోయాయన్నారు. అదేవిధంగా ఇంటింటికి మిషన్ భగీరథ ద్వారా ఆడబిడ్డ ల గౌరవం పెంచేందుకు కృషి చేసామని పేర్కొన్నారు.

తెలంగాణ రాష్ట్ర పథకాలు నేడు దేశానికే ఆదర్శంగా నిలిచిపోయాయని,విద్యార్థులకు కేసీఆర్ ప్రవేశపెట్టిన ఆల్ఫాహారా పథకం కూడా దేశ వ్యాప్తంగా ప్రభుత్వ బడుల్లో అమలు చేయాలని ఆలోచిస్తుందని తెలిసిందని,ఇది ఎంతో గర్వించదగ్గ విషయం అన్నారు.కేసీఆర్ కిట్,న్యూట్రిషన్ కిట్లు ద్వారా కూడా ప్రభుత్వ ఆస్పత్రులల్లో ప్రసవాలు పెరిగాయని అన్నారు.ప్రజలందరికి నూతన సంవత్సర,రానున్న సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు.రానున్న కాలంలో లక్షతో పాటు తులం బంగారంతో కళ్యాణాలక్ష్మి,షాది ముబారక్ చెక్కులు అందుకుంటారని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో మార్కెట్ చైర్మన్ సురేందర్ రెడ్డి ,తహశీల్దార్,ఎంపీటీసీలు,సర్పంచ్ లు, సొసైటీ,మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ లు,డైరెక్టర్ లు ,లబ్దిదారులు,అధికారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement