Sunday, May 5, 2024

ఇక పోస్టుల భ‌ర్తీ….

అసెంబ్లీ వేదికగా నేడో రేపో సీఎం కేేసీఆర్‌ ప్రకటన
తొలుత పోలీస్‌ శాఖలో నియామకాలు
ఖాళీల వివరాలు తెప్పిస్తున్న సీఎస్‌
నేడు ముఖ్యమంత్రికి చేరనున్న నివేదిక
భర్తీకి కేలండర్‌ ప్రకటించే అవకాశం

హైదరాబాద్‌, : ఉద్యోగాల భర్తీపై ముఖ్య మంత్రి కేసీఆర్‌ శాసనసభలో ప్రకటన చేయనున్నారు. బడ్జెట్‌ సమావేశాలు ముగిసే లోపున రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీ, నియా మక ప్రక్రియపై సీఎం కీలక నిర్ణయాలు చేయనున్నారని అధికార వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రంలో 50వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని సీఎం కేసీఆర్‌ ఇదివరకు ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ ఉద్యోగుల వయో పరిమితిని పెంచడం, పదోన్నతులు కల్పించడం ద్వారా ఖాళీ అవుతున్న పోస్టుల వివరాలను ఇప్పటికే తెప్పించుకున్న ప్రభుత్వం ఏయే శాఖల్లో ఎన్నెన్ని ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయో వాటిని ఎలా భర్తీ చేయనున్నామో సీఎం ప్రకటన ద్వారా తెలుస్తుందని వారంటున్నారు. ప్రభుత్వ శాఖల వారీగా ఖాళీల సమా చారం పంపించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌ కుమార్‌ సోమవారం ఆయా విభాగాల అధిపతులను కోరారు. వాస్తవానికి వేతన సవరణ, పదవీ విరమణ వయో పరిమితి పెంపుతో పాటు ఖాళీల భర్తీపైనా అసెంబ్లిd వేదికగా సీఎం ప్రకటన చేయాలని భావించారు. అయితే ప్రభుత్వ శాఖలు సిద్ధం చేసిన
జాబితాలో డిసెంబర్‌ నెలాఖరు వరకే అందుబాటులో ఉన్న ఖాళీల వివరాలను తెలిపారని సమాచారం. సీఎం కేసీఆర్‌ ఆదేశం మేరకు ఫిబ్రవరి నెలాఖరు వరకు ఖాళీల వివరాలను తెప్పించాలని ఆదేశించడంతో ఆ సమాచారాన్ని యుద్ధ ప్రాతి పదికన అందజేయాలని సోమేష్‌ కుమార్‌ ఆయా ప్రభుత్వ శాఖల ముఖ్యులను కోరినట్టు సమాచారం. మంగళవారం రా త్రి వరకు లేదా బుధవారం ఉదయం వరకు ఆయా శాఖల్లో ఉ న్న ఖాళీల వివరాలు అందే అవకాశం ఉందని వాటిని క్రోడీకరి ంచి కేసీఆర్‌కు నివేదించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది.
వీలైతే బుధవారం లేదా బడ్జెట్‌ సమావేశాల చివరి రోజున ఖాళీల భర్తీకి సంబంధించి సీఎం కేసీఆర్‌ కీలక ప్రకటక చేయ నున్నారని భావిస్తున్నారు. బడ్జెట్‌ పద్దులపై చర్చ అనంతరం సీఎం కేసీఆర్‌ సమాధానం ఇవ్వనున్నారని ఈ సందర్భంగానే ఖాళీలకు సంబంధించిన విధి విధానాలను, వాటిని భర్తీ చేసే షెడ్యూల్‌ను ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. తొలుత పోలీస్‌ తదితర నియామక సంస్థల ద్వారా చేపట్టే ఖాళీల వివరా లను ప్రకటిస్తారని ప్రతినెలా ఉద్యోగ నియామకాలకు సంబం ధించిన క్యాలెండర్‌ను ప్రకటించి తద్వారా ఖాళీలను భర్తీ చేయనున్నట్టు తెలుస్తోంది.
పోలీస్‌ శాఖతో పాటు వైద్య ఆరోగ్య శాఖ, ఉపాధ్యాయ శాఖల్లో ఖాళీల వివరాలను త్వరితగతిన భర్తీ చేయాలన్న ఆలో చనతో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. పోలీస్‌ శాఖలో ఖాళీల వివరాలను ఆ శాఖ నియామక సంస్థ ద్వారా చేపట్టాలని సంక ల్పించారు. హోంగార్డు మొదలుకొని సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ స్థాయి వరకు ఉన్న ఖాళీల వివరాలను ఇప్పటికే తెప్పించుకున్న డీజీపీ మహేందర్‌రెడ్డి తుది ఆమోదం కోసం ప్రభుత్వానికి పంపాలని నిర్ణయించారు. ఆర్థిక శాఖ అనుమతి లభించాక పోలీస్‌ నియా మక సంస్థ ద్వారా విడుదల చేసే అవకాశముంది.
రాష్ట్రంలో కొత్తగా 23 జిల్లాలు ఏర్పడడం హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌కు తోడుగా సైబరాబాద్‌, రాచకొండ, ఖ మ్మం, వరంగల్‌, నిజామాబాద్‌, సిద్దిపేట, రామగుండం తది తర కమిషరేట్లలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేసి శాం తిభద్రతలను పూర్తిస్థాయిలో కాపాడాలన్న లక్ష్యంతో ప్రభు త్వం ఉంది. పోలీస్‌ శాఖలో నేర పరిశోధన విభాగాన్ని పటిష్టం చేయాలని భావిస్తున్న ప్రభుత్వం ఈ విభాగంలో మరిన్ని పోస్టులను మంజూరు చేసి భర్తీ చేయాలన్న నిర్ణయానికి వచ్చి నట్టు తెలుస్తోంది. అగ్నిమాపక శాఖ, ఫోరెన్సిక్‌, ఎస్‌ఐబీ, స్పెష ల్‌ బ్రాంచ్‌ తదితర విభాగాలను కూడా ఆధునీకరించే పనిలో ప్రభుత్వం ఉంది. రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్‌, సైబ రాబాద్‌, రాచకొండ పోలీస్‌ కమిషరేట్లలో వైట్‌ కాలర్‌ నేరాలు పెచ్చు పెరిగిపోవడంతో వాటిని అరికట్టి తద్వారా ఈ నేరాలకు పాల్పడే వారిని కఠినంగా శిక్షించాలని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే ఈ విభాగాలలో మరింత మందిని నియమించాలన్న ప్రతిపాదన పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఉగ్రవాదం, తీవ్రవాదాన్ని అంతమొందించాలని నేరరహిత రాష్ట్రంగా తెలంగాణాను దేశంలో అగ్రగామిగా చేయాలన్నది సీఎం కేసీఆర్‌ లక్ష్యంగా పెట్టుకున్నారని అందుకే పోలీస్‌ శాఖలో అన్ని విభాగాల ఖాళీలను భర్తీ చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నా మని ఈ శాఖ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు.
వైద్య ఆరోగ్య శాఖలో…
వైద్యులతో పాటు పారా మెడికల్‌ సిబ్బంది ఖాళీలను త్వరి తగతిన భర్తీ చేయాలన్న నిర్ణయానికి ప్రభుత్వం వచ్చింది. ఉస్మానియా, గాంధీ, కింగ్‌కోటి, నిమ్స్‌ వంటి పెద్దాసుపత్రుల్లో వైద్యులు, ఇతర సిబ్బంది ఖాళీలను తొలి మూడు మాసాల్లోనే భర్తీ చేయాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. హైదరాబాద్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బస్తీ దవాఖానాల్లో ఖమ్మం, వరంగల్‌, సిద్దిపేట, నిజామాబాద్‌, రామగుండం నగర పాలక సంస్థల్లోనూ ప్రారంభించాలని యోచిస్తున్న ప్రభుత్వం వైద్యు లు, ఇతర సిబ్బంది ఎంత అవసరమో గుర్తించి ఆ ఖాళీల భర్తీకి ఇప్పటి నుంచే చర్యలు చేపట్టాలని నిర్ణయించింది. వైద్య శాఖను బలోపేతం చేసే క్రమంలో భాగంగా బడ్జెట్‌లో ఎక్కువ నిధు లను కేటాయించిన సంగతి తెలిసిందే.
ఉన్నత, ప్రాథమిక విద్యా శాఖలో…
ఉన్నత విద్యాశాఖ పరిధిలోని ప్రభుత్వ జూనియర్‌, డిగ్రీ కళాశాలల్లో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులను వచ్చే విద్యా సం వత్సరం ఆరంభంలోపు భర్తీ చేసేందుకు ప్రభుత్వం ఉపక్రమి స్తోంది. విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్‌, అసోసి యేటెడ్‌, ప్రొఫెసర్‌ పోస్టులను కూడా దశల వారీగా భర్తీ చేసేం దుకు ప్రణాళిక రూపొందిస్తోంది. బోధనేతర సిబ్బంది నియా మకాలపై కూడా ప్రత్యేక దృష్టి సారించాలని నిర్ణయించింది. పాఠశాల విద్యాశాఖలో ఖాళీగా ఉన్న పదివేలకుపైగా ఉపా ధ్యాయ ఖాళీలను వీలైనంత త్వరగా భర్తీ చేయాలని సంకల్పి ంచింది. పాఠశాల విద్యాశాఖలో పదోన్నతుల ప్రక్రియ ద్వారా మిగిలిపోయిన ఖాళీలతో పాటు పదవీ విరమణ ద్వారా ఇప్పటికే ఉన్న ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ప్రభుత్వం సమా యత్తమవుతోంది. టీచర్‌ ఎలిజిబులిటీ టెస్ట్‌ (టెట్‌)ను నిర్వ హించి తద్వారా జిల్లా ఎంపిక కమిటీలు (డీఎస్సీ) ద్వారా వీటిని భర్తీ చేయాలా లేక ఏకకాలంలో టెట్‌, డీఎస్సీని జరపాలా అనే అంశంపై ప్రభుత్వంలో చర్చోపచర్చలు జరుగుతు న్నాయి. జూన్‌ నుంచి కొత్త విద్యా సంవత్సరం ప్రారంభ మవుతుండడంతో ఈలోపే ఈ నియామకాలను చేపట్టా లని బడులు తెరిచిన రోజే కొత్త ఉపాధ్యాయులు విధుల్లో చేరేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది.
రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఆయా ప్రభుత్వ శాఖల్లో పదోన్నతుల ప్రక్రియ చేపట్టి అర్హులైన వారందరినీ ఆ పై పోస్టులకు పంపించిన సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement