Sunday, April 28, 2024

ప్ర‌యాణాలు వాయిదా వేసుకోండి – ప్ర‌జ‌ల‌కు మంత్రి ఈట‌ల సూచ‌న‌

హైద‌రాబాద్ : క‌రోనా ఉధృతి దృష్ట్యా సాధార‌ణ‌ ప్ర‌యాణాలు వాయిదా వేసుకోవాల‌ని రాష్ర్ట వైద్యారోగ్య శాఖ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ ప్ర‌జ‌ల‌కు విజ్ఞ‌ప్తి చేశారు. అత్య‌వ‌స‌మైతే త‌ప్ప ఒక చోట నుంచి మ‌రో చోటికి ప్ర‌యాణం చేయ‌వ‌ద్ద‌ని అన్నారు.. హైద‌రాబాద్ లోని ఆయ‌న మంత్రిత్వ కార్యాల‌యంలో మీడియాతో మాట్లాడుతూ, క‌రోనా సెకండ్ వేవ్ తీవ్ర‌త గ్రామీణ ప్రాంతాల్లో కంటే ప‌ట్ట‌ణ ప్రాంతాల్లో క‌రోనా తీవ్రత అధికంగా ఉంద‌న్నారు. మున్సిపాలిటీల ప‌రిధిలో ఆ శాఖ మంత్రి కేటీఆర్ ఆధ్వ‌ర్యంలో క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్టు పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంత ప్ర‌జ‌ల‌కు ఎలాంటి ఇబ్బంది లేద‌ని, అయితే ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌గా ప్ర‌జ‌లంద‌రూ ఇళ్ల‌లోనే ఉండాల‌ని కోరారు..ఇక మ‌హారాష్ర్ట‌కు అనుకొని ఉన్న తెలంగాణ జిల్లాల ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని అన్నారు. ముఖ్యంగా జ‌గిత్యాల, నిర్మ‌ల్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల‌ ప్ర‌జలు అప్ర‌మ‌త్తంగా ఉంటూ ప్ర‌భుత్వ సూచ‌న‌ల‌ను పాటించాల‌న్నారు. ప్ర‌తి ఒక్క‌రూ స్వీయ నియంత్ర‌ణ పాటించాల‌ని కోరారు. ఏ ఆప‌దొచ్చినా తెలంగాణ ప్ర‌జ‌ల‌ను ప్ర‌భుత్వం ఆదుకుంటుంద‌ని స్ప‌ష్టం చేశారు. సోష‌ల్ మీడియాలో వ‌చ్చే వార్త‌ల‌ను న‌మ్మి ఎవ‌రూ భ‌యాందోళ‌న‌కు గురికావొద్ద‌ని మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ అన్నారు. రాష్ర్టంలో రెమిడెసివ‌ర్, ఆక్సిజ‌న్, బెడ్ల కొర‌త లేద‌ని స్ప‌ష్టం చేశారు

Advertisement

తాజా వార్తలు

Advertisement