Monday, April 29, 2024

డంపింగ్‌ యార్డును తలపిస్తున్న సేయింట్‌ మేరీస్‌ రోడ్డు..

మోండా : స్వచ్చ హైదరాబాద్‌ కోసం మనమంతా సమిష్టిగా కృషి చేద్దాం..ప్రజలను భాగస్వాములను చేస్తూ కాలనీలను, బస్తీలను పరిశుభ్రంగా మారుద్దాం అంటూ పారిశుద్ద పర్యవేక్షక అధికారులు నిత్యం చెప్పె మాటలు ఎంతో ముచ్చట గోలుపుతాయి. కానికొంతమంది పారిశుధ్ద్య సిబ్బంధి నిర్లక్ష్యం, ఆరి అనాలోచితా చర్యల కారణంగా అధికారుల మాటలు నీటిమీద రాతలేనని నిరూపిస్తున్నాయి. రెజిమెంటల్‌ బజార్‌ ప్రాంతంలోని మనోహర్‌ థియేటర్‌ వెనుక వైపు ప్రాంతంలో రోడ్డంతా డంపింగ్‌ యార్డును తలపిస్తుంది. ఇందుకు కొంతమంది స్థానికులు, వ్యాపారుల నిర్లక్ష్యం కారణమైతే ఇందులో సగం జీహెచ్‌ంసీ పారిశుద్ద్య సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే చెత్త కుప్పలు పేరుకుపోతున్నాయి. ఇక్కడ చెత్తను వేయరాదని, చెత్త వేస్తే జరిమానాలు విధించబడతాయని గోడలపై సూచికలు ఏర్పాటు చేసిచేతులు దులుపుకుంటున్న అధికారులు తరువాత పర్యవేక్షించడం నిర్లక్ష్యం వహిస్తుండటంతో స్వయంగా కొంతమంది జీహెచ్‌ంసీ సిబ్బందే చెత్తను పరిసరప్రాంతాల నుండి తీసుకు వచ్చి ఇక్కడ డంపు చేస్తున్నారు. దీంతో తొలగించవలసిన వారే ఇక్కడ పడవేస్తున్నారేమీటీ అంటూ అటుగా వచ్చి పోయే వారు ముక్కున వేలేసుకుంటున్నారు. కంచె చేను మేసిన చందంగా కొంతమంది సిబ్బంది నిర్లక్ష్యం జీహెచ్‌ంసీకి చెడ్డ పేరును ఆపాదించి పెడుతుంది. చెత్తకు ప్పలను సరైన సమయంలో తొలగించక పోవడం, చిత్తు కాగితాలు, ఇతర వ్యర్ధాలు గాలికి ఇళ్ళ ముందుకు వచ్చి పడుతుండటంతో పాటు తీవ్ర దుర్ఘంధాన్ని వెదజల్లుతూ స్థానిక ప్రజలకు అసౌకర్యాన్ని కల్గిస్తున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి చెత్త పడవేసే వారికి భారీగా జరిమానాలు విధించడంతో పాటు నిర్లక్ష్యంగా వ్యవహరించే సిబ్బందిపై శాఖపరమైన చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement