Tuesday, April 30, 2024

Hyderabad: బంజారాహిల్స్‌లో మందుబాబుల హ‌ల్ చ‌ల్

హైద‌రాబాద్ న‌గ‌రంలోని బంజారాహిల్స్‌లో కొందరు మందుబాబులు మద్యం సేవించి రోడ్డుపై వీరంగం సృష్టించారు. రోడ్డుపై అడ్డంగా కూర్చొని నానా హంగామా చేశారు. పార్క్‌హయత్ దగ్గర పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో కొందరు మందుబాబులు వీరంగం సృష్టించారు. సరైన పత్రాలు చూపించకపోవడమే కాకుండా.. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. వాహనాలను ఆపుతూ నానా హంగామా చేశారు. ఓ పేరుతో స్టిక్కరున్న కారును అడ్డగించి లోపల ఉన్నవారిని బయటకు దించాలంటూ పోలీసులతో వాదనకు దిగారు. రోడ్డుకు అడ్డంగా కూర్చొని ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించారు. మూడుగంటలపాటు హల్ చల్ చేసిన మందుబాబులతోపాటు మరోవైపు ఓ హిజ్రా కూడా హల్ చల్ చేయడంతో పోలీసులకు చుక్కలు కనిపించాయి. రోడ్డుపై వాహనాలను ఆపుతూ గంటల తరబడి ట్రాఫిక్‌కు అంతరాయం కలిగిస్తున్న మందుబాబులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్​కు తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement