Monday, May 29, 2023

గొర్రెల మంద‌పై కుక్క‌ల దాడి.. 18 గొర్రెలు మృతి…

గొర్రెల మంద‌పై కుక్క‌లు దాడి చేసిన ఘ‌ట‌న అబ్దుల్లాపూర్ మెట్ మండ‌లంలో చోటుచేసుకుంది. ఈ దాడిలో సుమారు 18 గొర్రెలు మృతి చెందాయని బాధితుడు బీరప్ప తెలిపాడు. వివ‌రాలు ఇలా ఉన్నాయి.. అబ్దుల్లాపూర్ మెట్ మండలం తారమాత్ పేట్ గ్రామానికి చెందిన బీరప్ప తన తండ్రి ఆరోగ్యం బాగా లేనందున త‌మ‌కున్న 120 గొర్రెలను ఇతనే చూసుకుంటున్నాడు. ఇదే క్రమంలో గొర్రెలను తన దొడ్డి పక్కనే ఉన్న మరో గొర్రెల కాపరికి చూడమని చెప్పి ఇంటికి వెళ్ళాడు. ఉదయాన్నే వ‌చ్చి చూడ‌గా 18 గొర్రెలు చనిపోయి కనపడ్డాయి. మరికొన్ని గాయాలతో ఉన్నాయి. ఈ విషయాన్ని గ్రామ ఎంపీటీసీ చేగూరి వెంకటేష్ యాదవ్ కు తెలపడంతో సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. అనంతరం అబ్దుల్లాపూర్ మెట్ పోలీసులకు సమాచారం అందించి గాయపడ్డ గొర్రెలకు చికిత్స నిమిత్తం డా.నరసింహారావుకు సమాచారం ఇచ్చి చికిత్స చేయించారు. బీరప్ప ప్రభుత్వం నుంచి సహకారం అందించే విధంగా చర్యలు తీసుకోవాలని ఎంపీటీసీ చేగురి వెంకటేష్ ను వేడుకున్నాడు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన వారిలో ఉప సర్పంచ్ గోసిక నరసింహ, వార్డు సభ్యులు, గ్రామస్తులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement