Saturday, May 4, 2024

Followup: సీఐ నాగేశ్వర్‌రావును విధుల నుంచి తొలగింపు.. ఉత్తర్వులు జారీ చేసిన నగర సీపీ సీవీ ఆనంద్‌

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : మారేడ్‌పల్లి సీఐ నాగేశ్వర్‌రావుపై పోలీసు శాఖ వేటు వేసింది. సీఐని విధుల నుంచి తొలగిస్తూ హైదరాబాద్‌ సీపీ సీవీ ఆనంద్‌ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. వివాహితపై అత్యాచారం, అపహరణ ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఐ నాగేశ్వర్‌రావును 3 నెలల క్రితం వనస్థలిపురం పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు. ఈ విషయాన్ని వనస్థలిపురం పోలీసులు సీవీ ఆనంద్‌ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో సీపీ సీవీ ఆనంద్‌ వెంటనే స్పందించి నాగేశ్వర్‌రావును అప్పుడే సస్పెండ్‌ చేశారు. రెండున్నర నెలలకు పైగా చర్లపల్లి జైల్లో నాగేశ్వర్‌రావు ఖైదీ ఉన్నారు. బేయిల్‌ కోసం ఎల్బీనగర్‌ కోర్టులో రెండు సార్లు పిటిషన్‌ వేయగా.. కోర్టు బేయిల్‌ను తిరస్కరించింది. దీంతో సీఐ నాగేశ్వర్‌రావు బేయిల్‌ కోసం హైకోర్టును ఆశ్రయించగా.. సెప్టెంబర్‌ 28న షరతులతో కూడిన బేయిల్‌ మంజూరుకావడంతో చర్లపల్లి జైల్‌ నుంచి విడుదలయ్యారు. నాగేశ్వర్‌రావు కేసును పోలీసు ఉన్నతాధికారులు తీవ్రంగా పరిగణించారు. అన్యాయం జరిగిన వాళ్లకు తగిన న్యాయం చేయాల్సిన పోలీసులే ఇలాంటి కేసుల్లో ఇరుక్కుంటే సమాజానాకి తప్పుడు సందేశం వెళ్లుతుందనే ఉద్దేశంతో పోలీసు ఉన్నతాధికారులు నాగేశ్వర్‌రావును విధుల నుంచి తొలగించాలని నిర్ణయం తీసుకోవడంతో.. సీపీ సీవీ ఆనంద్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

10 నెలల కాలంలో 55 మందిపై చర్యలు..

సీపీగా సీవీ ఆనంద్‌ డిసెంబర్‌ 25న బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఇప్పటీ వరకు 55 మంది పోలీసులపై చర్యలు తీసుకున్నారు. మహిళా కానిస్టేబుల్‌ను లైంగికంగా వేధించిన లాలాగూడ ఇన్స్‌పెక్టర్‌ శ్రీనివాస్‌రెడ్డి, అదనపు కట్నం కోసం భార్యను వేధించిన రిజర్వ్‌ ఇన్స్‌పెక్టర్‌ ఎడ్ల శ్రీనివాస్‌తో పాటు మరో 53 మందిని సర్వీస్‌ నుంచి తొలగించినట్లు తెలిపారు. నాగేశ్వర్‌రావు కేసుకు సంబంధించిన వివరాలను కూడా ఒక నోటులో సీపీ కార్యాలయం వివరించింది. ‘ నింధితుడు నాగేశ్వర్‌రావుకు హైదరాబాద్‌ శివారులో వ్యవసాయ క్షేత్రం ఉంది. నాలుగేళల కిందట బాధిత మహిళా భర్తను ఒక కేసులో టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్టు చేసినప్పుడు .. సీఐగా ఉన్న నాగేశ్వర్‌రావు అతడిని విచారించారు. ఇన్స్‌పెక్టర్‌ ఒక రోజు బాధిత మహిళను ఫామ్‌హౌస్‌కు వెళ్దామని పిలిచాడు. ఈ విషయాన్ని ఆమె తన భర్తకు చెప్పగా.. వెంటనే అతడు నాగేశ్వర్‌రావుకు ఫోన్‌ చేశాడు. ఇదంతా మీ భార్యకు చెబుతానని హెచ్చరించడంతో.. తప్పయింది. క్షమించు ‘ అంటూ సీఐ నాగేశ్వర్‌రావు అతడిని వేడుకున్నారు. దీంతో ఆ వివాదం సద్దుమణిగింది.

- Advertisement -

అయితే ఈ విషయాన్ని జీర్ణించుకోని సీఐ.. బాధిత మహిళ భర్తను ఒక రోజు సికింద్రాబాద్‌లోని టాస్క్‌ఫోర్స్‌ కార్యాలయానికి రప్పించాడు. అతడి జేబులు, చేతుల్లో గంజాయి సంచులు ఉంచి వీడియోలు, ఫోటోలు తీయించాడు. వాటిని ఆధారంగా కేసు నమోదు చేయిస్తానని బాధితుడిని హెచ్చరించి పంపించారు. గత ఏడాది ఫిబ్రవరి వరకు ఫామ్‌హౌస్‌లో పని చేసిన అతడు.. ఆ తర్వాత పని మానేశాడు. వనస్థలిపురంలో భార్య పిల్లలతో కలిసి అద్దె ఇంట్లో నివసిస్తున్నాడు. వారి కదలికలపై నిఘా ఉంచిన సీఐ నాగేశ్వర్‌రావు.. భర్తలేని సమయంలో జులై 6న బాధిత మహిళకు వాట్సఫ్‌ కాల్‌ చేశారు. నీ మొగుడు ఊల్లో లేడుగా.. నేను వస్తున్నాను అంటూ మాట్లాడారు. ఈ విషయాన్ని ఆమె భర్తకు చెప్పింది. ఆ సమయంలో సొంతూరు ఉన్న అతడు వెంటనే తిరిగి వచ్చారు. భర్త వనస్థలిపురానికి రాడనుకుని.. నాగేశ్వర్‌రావు బాధితురాలి ఇంటికి వెళ్లారు. తలుపు వేసి ఆమెను కొట్టడం, రివాల్వర్‌ కణతకు గురిపెట్టి అత్యాచారం చేశారు. అర్థరాత్రి వరకు నాగేశ్వర్‌రావు ఇంట్లోనే ఉన్నాడు.. ఈ లోగా ఆమె భర్త తిరిగొచ్చాడు. ఇంట్లో ఉన్న నాగేశ్వర్‌రావును చూసి ఆగ్రహించిన కర్రతో కొట్టాడు. వెంటనే నాగేశ్వర్‌రావు తన రివాల్వర్‌ను తీసి భార్యభర్తలను చంపేస్తానంటూ బెదిరించాడు. ఇద్దరిని బలవంతంగా కారులో ఎక్కించుకుని తన ఫామ్‌హౌస్‌ వైపు బయలుదేరగా.. ఇబ్రహీంపట్నం చెరువుకట్టపై టైర్‌ పేలింది. కారు ఆగిపోవడంతో దంపతులిద్దరు తప్పించుకుని పోలీసులను ఆశ్రయించగా విషయం వెలుగులోకి వచ్చి నాగేశ్వర్‌రావు కటకటాలపాయ్యారు ‘ అని పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement