Thursday, May 2, 2024

గర్భధారణను ఆలస్యం చేస్తే సంతానం పొందే అవకాశాలు క్షీణిస్తాయి : డాక్టర్‌ సునీత ఇలినాని

గ‌ర్భ‌ధార‌ణ‌ను ఆల‌స్యం చేస్తే సంతానం పొందే అవ‌కాశాలు క్షీణిస్తాయ‌ని బంజారాహిల్స్ అపోలో ఫెర్టిలిటీ సెంట‌ర్ ల్యాప్రో స్కోపిక్ స‌ర్జ‌న్ అండ్ క‌న్స‌ల్టెంట్ ఫెర్టిలిటీ స్పెష‌లిస్ట్ డాక్టర్‌ సునీత ఇలినాని తెలిపారు. ఆమె మాట్లాడుతూ….. ప్రతి మ‌హిళ పునరుత్పత్తి సంవత్సరాలు ఆమె వయస్సు 20లలో ఉన్నప్పుడు బాగా ఉంటే, ఆ తర్వాత 30లలో ముఖ్యంగా 35 ఏళ్ల తర్వాత సంతానోత్పత్తి అనేది క్రమంగా తగ్గుతుందన్నారు. 35 ఏళ్ల కంటే తక్కువ వయస్సున్న మహిళలలో, సహజంగా గర్భం దాల్చే అవకాశం నెలకు 20శాతం ఉంటుందన్నారు. సహజంగా గర్భం దాల్చే అవకాశం అనేది 35 ఏళ్ల తర్వాత నెలకు 10శాతంకు తగ్గుతుందన్నారు. 40 ఏళ్ల తర్వాత అది కేవలం 5శాతం మాత్రమేన‌న్నారు.


వయస్సు పైబడిన తరువాత దాత అండాలతో మాత్రమే గర్భం దాల్చడానికి ఎఆర్‌టిని ఉపయోగించి విజయవంతం అవుతున్నారని మహిళలు గ్రహించాలన్నారు. ఎఆర్‌టి కూడా హానికరమేన‌న్నారు. అంతేకాకుండా ఖరీదైనది, చాలా బీమా హెల్త్‌ ప్లాన్‌ల ద్వారా ఇది కవర్‌ చేయబడదున్నారు. వయస్సు ఎక్కువయ్యే కొద్దీ తల్లి, శిశువులు ఇద్దరికీ గర్భధారణ వలన సమస్యలు పెరుగుతాయన్నారు. క్లినికల్‌ గర్భాశయ గర్భం తర్వాత గర్భధారణ నష్టం రేట్లు 35 కంటే తక్కువ వయస్సున్న మ‌హిళల్లో 16.4శాతం 35 నుండి 39 మధ్య వయస్సు గల మ‌హిళ‌ల్లో 10.4శాతం, 40 సంవత్సరాల వయస్సు గల మ‌హిళ‌ల్లో 33శాతం కి పెరిగిందన్నారు. సరైన విజయం కోసం దీనిని 35 ఏళ్లలోపు గానే చేయాలన్నారు. ప్రీ ఇంప్లాంటేషన్‌ జెనెటిక్‌ స్క్రీనింగ్ ఐవీఎఫ్‌ సైకిల్‌లో సృష్టించబడిన పిండాలకు వర్తిస్తుందన్నారు. ఇది వయస్సు పైబడిన మహిళలకు ప్రత్యేకంగా ఉపయోగపడుతుందన్నారు. ప్రీఇంప్లాంటేషన్‌ జెనెటిక్‌ స్క్రీనింగ్‌తో, ప్రతి పిండం నుండి తక్కువ సంఖ్యలో కణాలు తొలగించి జన్యుపరంగా మూల్యాంకనం చేస్తారన్నారు. తల్లి గర్భాశయానికి బదిలీ చేయడానికి పిండాలను సాధారణ క్రోమోజోమ్‌ పిండాల నుండి ఎంచుకుని గర్భధారణ రేటును మెరుగుపరుస్తుందన్నారు. గర్భస్రావాలను తగ్గిస్తుందని, పిండం జన్యుపరమైన రుగ్మతకు గురయ్యే ప్రమాదాన్ని కూడా నివారించవచ్చన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

- Advertisement -

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement