Tuesday, April 30, 2024

పర్వ‌తమాల.. కొండప్రాంత ప్ర‌జ‌ల‌కు వ‌రం.. 6 కి.మీ పొడ‌వునా సుల‌భ‌త‌ర ర‌వాణా..

కష్టతరమైన కొండ ప్రాంతాలలో ఉన్న సంప్రదాయ రహదారులకు బదులుగా పర్యావరణపరంగా స్థిరమైన ప్రత్యామ్నాయంగా రోప్‌వేలను అభివృద్ధి చేస్తామని కేంద్రం ప్రకటించింది. జాతీయ రోప్‌వేల అభివృద్ధి కార్యక్రమాన్ని పీపీపీ పద్ధతిలో చేపడతారు. పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడమే కాకుండా ప్రయాణికులకు కనెక్టివిటీ, సౌకర్యాన్ని మెరుగుపరచడమే లక్ష్యంగా రోప్‌వేల అభివృద్ధికి కేంద్రం చొరవచూపింది. రద్దీగా ఉండే పట్టణ ప్రాంతాలను కూడా ఇది కవర్‌ చేస్తుంది. ఇక్కడ సంప్రదాయ సామూహిక రవాణా వ్యవస్థ సాధ్యం కాదు. 2022-23లో 60 కి.మీ పొడవునా 8 రోప్‌వే ప్రాజెక్టులకు కాంట్రాక్టులు ఇవ్వనున్నట్లు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ తన బడ్జెట్‌ ప్రసంగంలో తెలిపారు. ఇప్పటివరకు భారతదేశంలో అత్యంత రద్దీగా ఉండే రోప్‌వేగా మానసా దేవి రోప్‌వే గుర్తింపు పొందింది. ఆసియాలో అతి పొడవైన రోప్‌వే అయిన చండీ దేవి, కాళీ దేవి, గిర్నార్‌ వంటి రోప్‌వేలు ఇతర ప్రదేశాలను అనుసంధానించడానికి ఉపయోగించబడుతున్నాయి. గుల్మార్గ్‌, ఔలి వంటి కొన్ని హాలిడే స్పాట్‌లు కూడా రోప్‌వేల ద్వారా అనుసంధానించబడి ఉన్నాయి.

సుల‌భ‌త‌ర ర‌వాణా..

ఆర్థిక పరివర్తన, అతుకులు లేని మల్టి మోడల్‌ కనెక్టివిటీ తోపాటు లాజిస్టిక్స్‌ సామర్థ్యం కోసం ప్రధానమంత్రి గతిశక్తి నేషనల్‌ మాస్టర్‌ ప్లాన్‌ ఏడు ఇంజిన్‌లను కలిగి ఉంటుందని ఆర్థిక మంత్రి చెప్పారు. గతిశక్తి మాస్టర్‌ ప్లాన్ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలు అభివృద్ధి చేసిన మౌలిక సదుపాయాలు కూడా ఇందులో ఉంటాయి. ప్రణాళిక, వినూత్న మార్గాలతో సహా ఫైనాన్సింగ్‌, సాంకేతికత వినియోగం, వేగవంతమైన అమలుపై దృష్టి కేంద్రీకరించ బడుతుంది. ఉత్పాదకతను పెంపొందించడానికి, ఆర్థిక వృద్ధిని, అభివృద్ధిని వేగవంతం చేయడానికి ప్రపంచ స్థాయి ఆధునిక మౌలిక సదుపాయాలు సహాయపడతాయని అన్నారు.

అతుకులు లేని మ‌ల్టీమోడ‌ల్ ఉద్య‌మం..

అప్లికేషన్‌ ప్రోగ్రామింగ్‌ ఇంటర్‌ఫేస్‌ (ఏపీఐ) కోసం రూపొందించబడిన యూనిఫైడ్‌ లాజిస్టిక్స్‌ ఇంటర్‌ఫేస్‌
ప్లాట్‌ఫారమ్‌ (యూఎల్‌ఐఎఫ్‌)లో అన్ని మోడ్ ఆపరేటర్‌ల మధ్య డేటా మార్పిడిని తీసుకురానున్నారు.
ఇది వివిధ మోడ్‌ల ద్వారా వస్తువులను సమర్ధవంతంగా తరలించడం, రవాణా ఖర్చుతోపాటు సమయాన్ని తగ్గించడానికి అవసరమైన ప్రక్రియలో సంక్లిష్ట డాక్యుమెంటేషన్‌ను సరళీకృతం చేస్తుంది. ముఖ్యంగా, ఇది అన్ని వాటాదారులకు నిజ సమయ సమాచారాన్ని అందిస్తుంది. అంతర్జాతీయ పోటీతత్వాన్ని మెరుగు పరుస్తుంది. ఓపెన్‌ సోర్స్‌ మొబిలిటీ స్టాక్‌, ప్రయాణీకుల అతుకులు లేని ప్రయాణాన్ని నిర్వహించడం కూడా సులభతరం చేయబడుతుంది.

- Advertisement -

4 ప్రాంతాల్లో లాజిస్టిక్స్ పార్కులు..

పిపిపి విధానం ద్వారా నాలుగు ప్రదేశాలలో మల్టి మోడల్‌ లాజిస్టిక్స్‌ పార్కుల అమలు కోసం 2022-23లో
కాంట్రాక్టులు ఇవ్వనున్నారు. మల్టిమోడల్‌ లాజిస్టిక్స్‌ సౌకర్యాల కోసం వంద గతిశక్తి కార్గో టెర్మినల్స్‌ను రాబోయే మూడేళ్లలో అభివృద్ధి చేస్తారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement