Saturday, May 18, 2024

క్రాఫ్టింగ్‌ చేంజ్‌ అవార్డ్స్‌- గో స్వదేశీ హ్యాండ్లూమ్‌ ఎగ్జిబిషన్‌ను నిర్వహిస్తున్న గోకూప్‌

హైదరాబాద్‌ : జాతీయ చేనేత దినోత్సవ వేడుకల్లో భాగంగా గోకూప్‌ ఆగస్టు 13 వరకు గో స్వదేశీ చేనేత ప్రదర్శనను నిర్వహించనుంది. చేనేత వస్త్రాల మార్కెటింగ్‌కు గాను మొదటి జాతీయ అవార్డును గెలుచుకున్న గోకూప్‌, చేనేతను అభివృద్ధి చేయడం, ప్రోత్సహించడంలో విశిష్ట సేవలందించిన తమ కళాకారుల భాగస్వామ్యాలను గుర్తిస్తూ క్రాఫ్టింగ్‌ చేంజ్‌ అవార్డ్స్‌ కార్యక్రమం నిర్వహించింది. దీంతో పాటు ఆగస్టు 13 వరకు హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌ రోడ్‌ నెం.12లో కళింగ కల్చరల్‌ హాల్‌లో గో స్వదేశీ చేనేత ప్రదర్శనను కూడా గోకూప్‌ నిర్వహించనుంది.

తెలంగాణ ప్రభుత్వ చీఫ్‌ ఇన్నోవేషన్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ శాంత థౌతం ఈ కార్యక్రమాన్ని సోమవారం ప్రారంభించారు. గో స్వదేశీ చేనేత ప్రదర్శనలో భాగంగా నేత కార్మికులు, కళాకారులు రూపొందించిన చేనేత చీరలు, బట్టలు, దుస్తుల సామాగ్రి, స్టోల్స్‌, దుప్పట్టాలు, పురుషుల దుస్తులు, గృహలంతకరణ, అనుబంధ ఉత్పత్తులను ప్రదర్శిస్తున్నారు. ఈ కార్యక్రమ ఉద్దేశ్యం కళాకారులకు సహాయం చేయడంతో పాటు చేతితో తయారు చేసిన ఉత్పత్తులను పునరుద్ధరించడమే లక్ష్యంగా పెట్టుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement