Sunday, May 5, 2024

పరిసరాల పరిశుభ్రతే కరోనా నివారణకు మార్గం..

కవాడి గూడ : గాంధీనగర్‌ డివిజన్‌లోని వివిధ ప్రాంతాలలో కరోనా వైరస్‌ విజృంభిస్తున్నదని, కరోనా నివారణకు పరిశుభ్ర తే మార్గమని డివిజన్‌ కార్పోరేటర్‌ ఏ పావని వినయ్‌కుమార్‌ అన్నారు. రాబోయే రోజులలో దీనికి సిజనల్‌ వ్యాధులు తోడు కాకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆమె సూచించారు. డివిజన్‌లోని వివి గిరినగర్‌ బస్తీలో కార్పోరేటర్‌ ఆధ్వర్యంలో కరోనా పరీక్షల కేం ద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ సంధర్భంగా ఆమె మాట్లాడుతూ వివిధ బస్తీలు, కాలనీలు, మురికివాడల్లో శాని టైజర్ స్ప్రే చేసినట్లు తెలిపారు. పరిసరాల పరిశుభ్రత తప్పనిసరి అని, ఇందులో ప్రజలను భాగస్వాములను చేసి అవగాహాన కల్పించాలని అధికారులను కోరారు. కరోనా నివారణపై తాము చాలా సీరియస్‌గా పనిచేస్తున్నామన్నారు. కరోనా నివారణలో ఎక్కడా రాజీపగవద్దని. అధికారుల ఆదేశాలు పాటిస్తూ జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ప్రతి ఒక్కరు తమతమ ఇంటిని, పరిసరాలను పరిశుభ్రం చేసుకోవాలని తెలిపారు. కరోనాకు తోడుగా మలేరియా, డెంగ్యూ వంటి సిజనల్‌ వ్యాధుల భారిన పడే ప్రమాదం ఉందని వివరించారు. ఈ కార్యక్రమంలో బిజెపి నేతలు వినయ్‌కుమార్‌, ఉమేష్‌, విజయలక్ష్మి, సాయికుమార్‌, ఆనందరావు, సంతోష్‌, ఎఎన్‌ఎంలు కమల, జ్యోతి, కృపారాణి, ఆశ వర్కర్లు, జగదీశ్వరి, దుర్గ, గౌరి, స్వప్న, యాదమ్మ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement