Wednesday, May 15, 2024

HYD: కొకైన్, ఎండీఎంఏ పట్టివేత

రాయికల్ టోల్ ప్లాజా వద్ద డ్రగ్స్‌ను రంగారెడ్డి జిల్లా పోలీసులు పట్టుకున్నారు. టోల్‌ప్లాజా వద్ద షాద్‌నగర్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి వద్ద మూడు గ్రాముల కొకైన్‌, 5.491 గ్రాముల ఎండీఎంఏ, 3 గ్రాముల మత్తుమందును గుర్తించారు. దీంతో నిందితుడి అదుపులోకి తీసుకున్నారు. అతడిని హైదరాబాద్‌ అమీర్‌పేటకు చెందిన శబరీష్‌గా గుర్తించారు. కాగా, గచ్చిబౌలికి చెందిన లోకేశ్‌ చంద్ర అనే వ్యక్తి పరారీలో ఉన్నాడని చెప్పారు. దీనిపై పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement