Saturday, May 4, 2024

మ‌న మందులుపై కేంద్రం పెత్త‌నం …. షాక్ లో తెలంగాణ ప్ర‌భుత్వం….

తెలంగాణ పేషంట్ల ప్రాణాలు… గాలిలో దీపమే
రెమ్‌డెసివర్‌ వయల్స్‌ లాక్కున్న కేంద్రం
ఉత్పత్తి మనదగ్గర.. పెత్తనం తీసుకున్న కేంద్రం
4 లక్షల రెమ్‌డెసివర్‌ మందులు అందే సమయంలో కేంద్రం షాక్
మందుల కంపెనీలపై ఆంక్షలు
30వ తేదీవరకు కేవలం 21వేల వయల్స్‌ కేటాయింపు
ఆక్సిజన్‌కు కూడా కేంద్రం షాక్ ..
కేటాయింపుల్లో కేంద్రం వివక్ష
వ్యాక్సినేషన్‌ విషయంలోనూ.. అదే పంథా

హైదరాబాద్‌, : కేంద్రం తెలంగాణకు షాకుల మీద షాకులిస్తోంది. మందులు, ఆక్సిజన్‌, వ్యాక్సిన్స్‌ అన్నిం టా.. తెలం గాణ విషయంలో వివక్ష ప్రదర్శిస్తూ ఇక్కడి ప్రజల ప్రాణాలు గాల్లోకి వదిలేస్తుందన్న విమర్శలు తీవ్రస్థాయిలో వినబడుతున్నాయి. తాజాగా రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ ఉత్పత్తి కంపెనీలతో మాట్లాడి.. ఆర్డర్‌ ఇచ్చిన 4లక్షల రెమ్‌ డెసివర్‌ ఇంజక్షన్లు అందె సమ యంలో కేంద్రం మోకాలడ్డి ఈ ఇంజక్షన్ల పంపిణీని తమ చేతుల్లోకి తీసుకోవడంతో ప్రభుత్వం షాక్‌కు గురైంది. 4లక్షల రెమ్‌డెసివర్‌ ఇంజక్షన్లు వస్తే.. మందుల కొరత తీరుతుందని ప్రభుత్వం భావిస్తున్న తరుణంలో కేంద్రం హైదరాబాద్‌ కంపెనీల్లో ఉత్పత్తయ్యే మందులపై కూడా పెత్తనం తీసుకొని, గడచిన మూడురోజులు కూడా కలిపి మొత్తం పదిరోజులకు కేవలం 21 వేల రెమ్‌డెసివర్‌ ఇంజ క్షన్లు కేటా యించారు. రాష్ట్రాల అవసరాలు తెలుసుకోకుండా.. అత్యల్ప కేటా యింపులు చేయడంపై తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా మండి పడుతోంది. దీనిపై రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ కేంద్ర ఆరోగ్య మంత్రితో మాట్లా డినా.. హామీ లభించలేదు. ఈనెల 21వరకు కేంద్ర ప్రభుత్వ నియంత్రణలో రెమ్‌డెసివర్‌ లేదు. తెలంగాణ ప్రభుత్వం ఆర్డర్‌ ఇచ్చాకే.. కేంద్రం ఇలాంటి ఉత్తర్వులు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్‌ నగరానికి ఒక్క తెలంగాణ పేషెంట్లు మాత్రమే కాకుండా మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌ల నుండి కూడా పెద్దసంఖ్యలో రోగులు హైదరా బాద్‌ బాట పడుతున్నారు. ఇతర ప్రాంతాల వారు పెద్ద సంఖ్యలో హైదరా బాద్‌ వస్తుండడంతో తెలంగాణ ప్రాంత రోగులకు వైద్యసేవల విష యంలో ఒత్తిడి ఎదురవుతోంది.
మా రాష్ట్రం.. మా అవసరాలు
వ్యాక్సిన్‌ రాజధాని హైదరాబాద్‌ అని ఘనంగా ప్రకటిం చుకు న్నా.. ఇక్కడి ప్రజలు వ్యాక్సిన్‌ పూర్తిస్థాయిలో అందడం లేదు. హైదరా బాద్‌ కంపెనీలు ఉత్పత్తి చేసే వ్యాక్సిన్లు కూడా.. ఇక్కడి ప్రజలకు దక్కడం లేదు. దీనిపై ప్రజల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఇప్పటి వరకు రాష్ట్రంలో రెండు డోసుల వ్యాక్సిన్‌ తీసుకున్న వారు 4.18లక్షల మందే కాగా, తొలి డోసు పూర్తిచేసుకున్నవారు 29లక్షల మంది ఉన్నారు. 3 కోట్ల మంది అర్హుల్లో కనీసం పదిశాతం వ్యాక్సినేషన్‌ కూడా పూర్తికాకపోవ డానికి కేంద్రం సరైన రీతిలో సహాయం చేయ కపోవడమే కారణమని రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. ఆక్సి జన్‌ నిల్వల కేటాయింపులోనూ కేంద్రం తీవ్ర వివక్షను ప్రదర్శి స్తున్న ది. తెలంగాణకు ప్రతిరోజూ 384టన్నుల ఆక్సిజన్‌ అవ సరం కాగా, 260 నుండి 270 టన్నుల ఆక్సిజన్‌ కేటా యిస్తున్నారు. కేటా యింపుల్లోనూ తీవ్ర నిర్లక్ష్యం కనబ డుతోంది. దగ్గర ప్రాంతాలను వదిలి దూరప్రాంతాల ఆక్సిజన్‌ ప్లాంట్ల నుండి ఆక్సిజన్‌ కేటా యింపులు చేస్తుండగా, తమిళ నాడులో కేటాయించిన ఆక్సిజన్‌ ఇచ్చేందుకు.. ఆ రాష్ట్రం ససే మిరా అంటోంది. మా రాష్ట్రం మా ఆక్సి జన్‌ అంటూ మొండి కేసింది. తెలంగాణ కూడా రెమ్‌డెసివర్‌, వ్యా క్సిన్ల విషయంలో ప్రత్యేక కోటా సాధించకుంటే.. తీవ్ర కొరతతో ప్రజలకు మరిన్ని ఇబ్బందులు తప్పవని హెచ్చరిస్తున్నారు. వ్యాక్సిన్‌ కూడా.. ఏరోజుకారోజు లెక్కలు చూసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. వ్యాక్సిన్‌ తయారయ్యే రాష్ట్రంలో వ్యాక్సిన్‌ కొరతపై విస్మయం వ్యక్తమవుతోంది. వైద్యవ్యవస్థను కేంద్రం కంట్రోల్‌లోకి తీసుకోవడం వల్లే ఈ దుస్థితి తలెత్తిందని, అయినా రాష్ట్ర ప్రభు త్వం ఎవరికీ ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసు కుంటోందని ప్రభుత్వవర్గాలు తెలిపాయి.
ఎప్పటికపుడు ఆరా
రాష్ట్రంలో అందుబాటులో ఉన్న వెంటిలేటర్లు, అక్సిజన్‌ నిల్వలు, రెమ్‌డెసివర్‌, ఇతర మందులు, పీపీఈ కిట్లు, వ్యాక్సి న్లకు సంబంధించి ముఖ్యమంత్రి కేసీఆర్‌, రాష్ట్ర ఐటీ, పరిశ్ర మల శాఖ మంత్రి కేటీఆర్‌, సీఎస్‌ సోమేష్‌కుమార్‌లు ఎప్పటి కపుడు ఆరా తీస్తూ.. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా, పరిస్ధి తులను అంచనా వేసి సౌకర్యాలు సమకూరుస్తున్నారు. తెలం గాణలో కేసుల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ముందస్తు ప్రణాళికలతో ఉన్నా.. కేంద్రం తగిన స్థాయిలో స్పందించకపోవడం, కోటాకు కత్తెర్లు వేస్తుండడంతో ఇబ్బం దులు తలెత్తుతున్నాయి. ఫలితంగా రాష్ట్రంలో ఫార్మా హబ్‌ ఉన్నా, మందులు.. ఇతర ఆక్సిజన్‌ నిల్వల కోసం కేంద్రం వైపే చూడాల్సిన దుస్థితి నెలకొంది..

Advertisement

తాజా వార్తలు

Advertisement