Thursday, April 25, 2024

ఎమ్మెల్సీ కవితను కలిసిన బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను హైదరాబాద్‌లోని ఆమె నివాసంలో బ్రిటీష్ డిప్యూటీ హై కమిషనర్ గారెత్ విన్ ఓవెన్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గారెత్ విన్ ఓవెన్ కు ఎమ్మెల్సీ కవిత శుభాకాంక్షలు తెలియజేశారు. అనంత‌రం పలు అంశాలపై చర్చించారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధితో పాటు పలు అంశాలపై విస్తృతంగా చర్చించినట్లు ఎమ్మెల్సీ కవిత తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement