Tuesday, April 30, 2024

వీరంగం సృష్టించిన బైక‌ర్స్ – ఇద్ద‌రికి తీవ్ర గాయాలు

బైక‌ర్స్ వీరంగం సృష్టించారు.బైక్ ల‌తో యువ‌త ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ హంగామా సృష్టించారు. కాల‌నీలో బైక్ ల‌ని ర్యాష్ గా ఎందుకు న‌డుపుతున్నార‌ని ప్ర‌శ్నించిన యువ‌కుడిని బైక‌ర్స్ చిత‌క‌బాదారు..ఆ యువ‌కుడి ఇంట్లోకి వెళ్ళి మ‌రీ దాడి చేయ‌డం గ‌మ‌నార్హం..ఈ సంఘ‌ట‌న పాత‌బ‌స్తీలోని కాలాప‌త్త‌ర్ కాల‌నీలో చోటు చేసుకుంది.. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి.
కుటుంబసభ్యులు వారిని చికిత్స నిమిత్తం దవాఖానకు తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు అడిగి తెలుసుకున్నారు. సీసీటీవీల ఆధారంగా దాడికి పాల్పడినవారిని గుర్తిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేప‌ట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement