Sunday, April 28, 2024

బైక్ బజార్ ఫైనాన్స్ తో 2000 ఎలక్ట్రిక్ వాహనాలను పంపిణీ చేయనున్న బిగాస్

హైదరాబాద్: ప్రముఖ లాస్ట్-మైల్ లాజిస్టిక్స్ ప్రొవైడర్ అయిన పిక్ యు ప్రముఖ ఫైనాన్స్ ప్లాట్‌ఫారమ్ అయిన బైక్ బ‌జార్ తో ప్రతిష్టాత్మక భాగస్వామ్యం చేసుకున్నట్లు ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ బిగాస్ వెల్లడించింది. ఈ భాగస్వామ్యాన్ని గురించి బిజి ఎలక్ట్రిక్ స్కూటర్స్ వ్యవస్థాపకుడు అండ్ మేనేజింగ్ డైరెక్టర్, ఆర్ఆర్ గ్లోబల్ డైరెక్టర్ హేమంత్ కబ్రా మాట్లాడుతూ… ప్రపంచ స్థాయి నాణ్యత, సాంకేతికతతో కూడిన దేశీయ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను తుది వినియోగదారులకు మాత్రమే కాకుండా వృద్ధి, స్థిరత్వం కోసం ఈ వ్యవస్థ అంతటా భాగస్వామ్యాలతో ముందుకు వెళ్లడమే త‌మ లక్ష్యమ‌న్నారు. పిక్ యు, బైక్ బజార్ తో ఈ భాగస్వామ్యంతో తాము పొదుపు పరంగా ఎలక్ట్రిక్ మొబిలిటీని స్వీకరించడం వల్ల కలిగే ప్రత్యక్ష ప్రయోజనాన్ని ప్రదర్శించాలనుకుంటున్నామన్నారు.

బైక్ బజార్ ఫైనాన్స్ జాయింట్ ఎండి, కో-ఫౌండర్ కరుణాకరన్ వి మాట్లాడుతూ… సాంప్రదాయ రిటైల్ ఫైనాన్స్ రుణాలకు భిన్నంగా ఈవీ స్వీకరణను వేగవంతం చేయడానికి వినూత్న ఫైనాన్సింగ్ పరిష్కారాలు అవసరమ‌న్నారు. బైక్ బజార్ ఈ లక్ష్యాన్ని సాధించడానికి ప్రత్యేకంగా తీర్చిదిద్ది ఫైనాన్స్ సొల్యూషన్స్‌ని అనుసరించడానికి కట్టుబడి ఉందన్నారు. బైక్ బజార్ పర్యావరణ, సామాజిక, ప‌రిపాలన అభ్యాసాల రంగంలో సానుకూల ప్రభావాన్ని సృష్టించడానికి అంకితం చేయబడిందన్నారు. పిక్ యు సీఈఓ ప్రశాంత్ రెడ్డి ఈ భాగస్వామ్యం గురించి తన ఉత్సాహాన్ని వెల్లడించటంతో పాటుగా మరింత స్థిరమైన భవిష్యత్తు కోసం సంస్థ విజన్‌ను వివరించారు. పిక్ యు వద్ద, తాము హరిత, మరింత స్థిరమైన డెలివరీ పర్యావరణ వ్యవస్థను నిర్మించడానికి కట్టుబడి ఉన్నామన్నారు. బిగాస్, బైక్ బజార్‌లతో త‌మ సహకారం కార్బన్ ఉద్గారాలను తగ్గించడం, పర్యావరణ అనుకూలమైన చివరి మైలు పరిష్కారాలను ప్రోత్సహించడం అనే త‌మ లక్ష్యంతో సంపూర్ణంగా సమలేఖనం చేయబడిందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement