Sunday, April 28, 2024

వ్యవసాయ రంగంలో అద్భుత పురోగతి.. మంత్రి నిరంజ‌న్ రెడ్డి

హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి నుండి వివిధ రంగాల్లో, మరీ ముఖ్యంగా వ్యవసాయ రంగంలో అద్భుతమైన పురోగతిని సాధించామని తెలంగాణ వ్యవసాయ, సహకార శాఖల మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మంగ‌ళ‌వారం ఏసీఎఫ్ఐ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జాగో కిసాన్ జాగో అవగాహన ప్రచారంలో భాగంగా 10 మొబైల్ వ్యాన్‌లను ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వ విద్యాలయం (పిజెటిఎస్ఏయు) ఆడిటోరియం వద్ద జెండా ఊపి ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ… తెలంగాణ ముఖ్యమంత్రి నేతృత్వంలో ప్రారంభించిన ప్రత్యేక పథకాలు, మరీ ముఖ్యంగా రైతు వేదికల కేంద్రాలు పంచాయతీ స్థాయిలో ఏకీకృత పరిష్కారంగా అందుబాటులో వున్నాయన్నారు. నీటిపారుదల సౌకర్యాల విస్తరణ, చెరువుల పునరుద్ధరణ కారణంగా పత్తి, వరి విస్తీర్ణంలో గణనీయమైన పెరుగుదల సాధ్యపడిందని, ఫలితంగా వ్యవసాయ ఉత్పాదకత మెరుగుపడిందన్నారు. రైతుల సంపాదన కూడా పెరిగిందన్నారు. నీటిపారుదలకి ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు, తెలంగాణ ప్రభుత్వం రైతు సమాజానికి నాణ్యమైన వ్యవసాయ ఇన్‌పుట్‌ల లభ్యతను నిర్ధారించడానికి చురుకైన చర్యలను తీసుకుందన్నారు. రైతులకు ఇప్పుడు మేలైన విత్తనాలు, ఎరువులు, వ్యవసాయ రసాయనాలు సులభంగా అందుబాటులో ఉన్నాయన్నారు. అండ్ తెలంగాణ ప్ర‌భుత్వ సెక్ర‌ట‌రీ (వ్యవసాయ అండ్ సహకార శాఖ) ఏపీసీ ఎం.ర‌ఘునందన్ రావు, ఐఏఎస్ మాట్లాడుతూ.. ఆన్‌లైన్ లైసెన్స్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ ని వ్యవసాయ శాఖ ప్రవేశపెట్టడం వల్ల ఇన్‌పుట్‌ల రంగంలో మరింత విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటున్నాయన్నారు. తెలంగాణ ఇప్పుడు వేగంగా రైస్ బౌల్ అఫ్ ఇండియాగా అభివృద్ధి చెందుతోందన్నారు.

ఏసీఎఫ్ఐ అడ్వైజరీ కమిటీ చైర్మన్, ధనుకా గ్రూప్ చైర్మన్ ఆర్ జి అగర్వాల్ మాట్లాడుతూ… తెలంగాణలో ఈ మొబైల్ ఆడియోవిజువల్ వ్యాన్‌ల భారీ ప్రచారం, పురుగుమందుల సురక్షిత వినియోగంపై రైతులకు అవసరమైన శిక్షణను అందించడంలో గణనీయమైన పురోగతిని సాధించగలవన్నారు. ఈ వ్యాన్లు అధిక-నాణ్యత పురుగుమందుల సేకరణపై రైతులకు అవగాహన కల్పిస్తాయన్నారు. ఏపీఎంఏ కి కృతజ్ఞతలు తెలిపిన ఏసీఎఫ్ఐ సెక్రటరీ డాక్టర్ కళ్యాణ్ గోస్వామి మాట్లాడుతూ… పంట నిర్వహణ పద్ధతుల్లో తెగుళ్ల నిర్వహణ పద్ధతులను అనుసంధానం చేయడం, ఖాళీ కంటైనర్‌లను సరైన రీతిలో పారవేయడంపై రైతులకు అవగాహన కల్పించడం, వ్యవసాయ రసాయనాల వినియోగానికి సంబంధించిన ఖచ్చితమైన సమయం, పద్ధతులను నొక్కి చెప్పడం ఈ ప్రచారం లక్ష్యమని వివరించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement