Saturday, May 18, 2024

ఎమ్మెల్సీ ఎన్నిక‌ల పోలింగ్ ‌కు స‌ర్వం సిద్ధం…

హైదరాబాద్ , రాష్ట్రంలో జరిగే రెండు ఎమ్మెల్సీ ఎన్నికలకు ఈసీ సర్వం సిద్దం చేసింది. ప్రచార ఘట్టం ముగియడంతో ఎన్నికల నిర్వహణకు వేగం పెంచారు. ఈ నేపథ్యంలో పూ ర్తి ఏర్పాట్లు సిద్ద మవుతున్నాయి. హైదరాబాద్‌, రంగారెడ్డి, మహ బూబ్‌ నగర్‌ పట్టభద్రుల స్థానానికి జరిగే ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నెత‌ 14 ఆది వారంనాడు ఉద యం 8 గంటలనుండి సాయంత్రం 4 గంటల వర కు పోలింగ్‌ నిర్వహిస్తారు. ఎల్బీ స్టేడి యంలోని ఇండోర్‌ స్టేడియంలో పోలింగ్‌ సామాగ్రిని పంపి ణి చేస్తారు. ఈనెల 17 వ తేదీన సరూర్‌ నగర్‌ ఇం డోర్‌ స్టేడియంలో ఓట్ల లెక్కింపు జరుగుతుంది. మార్చి 22 వ తేదీన ఎన్నికల పూర్తి ప్రక్రియ పూర్తవుతుంది.
ఎమ్మెల్సీఎన్నికల నిర్వహణా ఏర్పాట్ల వివరాలు.
14న ఉదయం 8 గంటలనుండి సా. 4 గంటలవరకు పోలింగ్‌ జరుగుతుంది. 17 న ఎల్‌.బి నగర్‌ ఇండోర్‌ స్టేడియం లో ఓట్ల లెక్కింపు జరుగుతుంది. మొత్తం తొమ్మిది జిల్లాలైన మహబూబ్‌ నగర్‌, నాగర్‌ కర్నూల్‌, వనపర్తి, జోగులాంబ గద్వాల్‌, నారా యణ పేట, రంగారెడ్డి, వికారా బాద్‌, మేడ్చల్‌ మల్కా జిగిరి, హైదరాబాద్‌ జిల్లాల్లో నమోదు చేసుకున్న గ్రాడ్యు యేట్‌ ఓటర్లు ఓటింగ్‌లో పాల్గొం టారు.మొత్తం ఓటర్లు 5,31,268 ఓటర్లు ఉండగా వీరిలో 33 6256 మంది పురుషులు, 194944 మంది స్రీలు ఉన్నారు. 68 మంది ఇతరులు ఉన్నారు. అత్య ధి కంగా మేడ్చల్‌ మల్కా జి గిరిలో 13 1284 మంది ఓటర్లు ఉండగా అతి తక్కువగా నారా యణ పేట్‌ జిల్లాలో 13899 మంది మాత్రమే ఉన్నారు.
మొత్తం నియోజక వర్గంలోని ఓటర్లలో మహబూబ్‌ నగర్‌ జిల్లాలో 35510 మంది ఓటర్లు, నాగర్‌ కర్నూల్‌ జిల్లాలో 33924 , వన పర్తి జిల్లాలో 21158 , జోగులాంబ గద్వాల్‌ లో 14876 , నారాయణ్‌ పేట్‌ లో 13899 , రంగారెడ్డి జిల్లాలో 144416 , వికారా బా ద్‌లో 25958, మేడ్చల్‌ మల్కాజిగిరిలో 131284 , హైద‌రాబాద్‌ జిల్లాలో 110243 మంది ఓటర్లు ఉన్నారు. నియో జక వర్గంలో 799 పోలింగ్‌ కేంద్రా లున్నాయి. వీటిలో మహబూబ్‌ నగర్‌ జిల్లాలో 56 , నాగర్‌ కర్నూల్‌ జిల్లాలో 44 , వనపర్తి జిల్లాలో 31 , జోగులాంబ గద్వాల్‌ లో 22 , నారాయణ్‌ పెట్‌ లో 20 , రంగారెడ్డి జిల్లాలో 199 , వికారాబాద్‌ లో 38 , మేడ్చల్‌ మల్కాజిగిరి లో 198 హైదరాబాద్‌ జిల్లాలో 191 ఉన్నాయి. ఎన్నికల ప్రవర్తనా నియ మావళి అమలు, ఎన్నికల నిర్వహణ సాఫీగా జరగడానికి గాను ప్రతి అసెంబ్లిd నియోజక వర్గ పరిధిలో ఒక ప్లయ్యింగ్‌ స్క్వాడ్‌ , స్టాటిక్‌ సర్వేలెన్స్‌ టీమ్‌లను ఏర్పాటు చేశారు. ఈ ఎన్నికల నిర్వహణలో మొత్తం 3835 మంది ఎన్ని కల సిబ్బంది పాల్గొంటారు. వీరిలో 959 మంది పి.ఓ లు, .ఓ.పి.ఓ 2876 మంది ఉన్నారు.
ఎన్నికల బరిలో అధికంగా 93 మంది ఉండ డంతో జంబో బాలెట్‌ పేపర్‌ తో పాటు జంబో బాలెట్‌ బాక్స్‌ లను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ప్రతి పోలింగ్‌ కేంద్రానికి రెండు బాలెట్‌ బాక్సుల చొప్పున 1598 బా లట్‌ బాక్సులు, అదనంగా 324 బాక్సులను సిద్ధంగా ఉంచారు. ఈ జంబో బాలెట్‌ బాక్సులలో పోలింగ్‌ కేంద్రాలకు అదనంగా 20 శాతంతో కలిపి మహ బూబ్‌ నగర్‌ జిల్లాకు 269 బాక్సులను, నాగర్‌ కర్నూల్‌ జిల్లాకు 212 , వనపర్తి జిల్లాకు 149 , జోగులాంబ గద్వాల్‌ కు 106 , నారాయణ్‌ పేట్‌కు 96 , రంగారెడ్డి జిల్లాకు 956 , వికారాబాద్‌ కు 183 , మేడ్చల్‌ మల్కాజిగిరి కి 951, హైదరాబాద్‌ జిల్లాకు 917 కేటాయించారు. 80 ఏళ్ల వృద్దులకు, కరోనా పాజిటివ్‌ ఓటర్లకు వారి ఇంటి వద్దకే ఎన్నికల సిబ్బంది వెళ్లి పోస్టల్‌ బ్యాలెట్‌ తో ఓటును వేయించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement