Monday, April 29, 2024

E-Smart Clinic: అందుబాటులోకి విప్ల‌వాత్మ‌క‌ ఈ – స్మార్ట్ క్లినిక్

హైదరాబాద్ : ఐఐటీ ఢిల్లీకి చెందిన ఫిట్ (ఫౌండేషన్ ఫర్ ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ ట్రాన్స్‌ఫర్), భారత ప్రభుత్వంచే ప్రారంభించబడిన జాతీయ కార్యక్రమమైన‌ ఉన్నత్ భారత్ అభియాన్ సహకారంతో ఐవీడీ ఉత్పత్తుల ప్రముఖ తయారీదారు, లార్డ్స్ మార్క్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ గ్రామీణ భారతదేశంలో హెల్త్‌కేర్ యాక్సెస్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి ఉద్దేశించిన విప్లవాత్మక ఈ – స్మార్ట్ క్లినిక్ ప్రాజెక్ట్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ ప్రాజెక్టును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాజ్‌కోట్ ఎయిమ్స్‌లో ప్రారంభించారు.

ఈ సందర్భంగా లార్డ్స్ మార్క్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మానవ్ తేలి మాట్లాడుతూ… ఉన్నత్ భారత్ అభియాన్‌తో కలిసి అద్భుతమైన ఈ-స్మార్ట్ క్లినిక్ ప్రాజెక్ట్‌ను పరిచయం చేయడం పట్ల సంతోషిస్తున్నానన్నారు. ప్రజలందరికీ, సమానమైన ఆరోగ్య సంరక్షణ అందించాలనే త‌మ లక్ష్యంలో ఇది ఒక ముఖ్యమైన అడుగు అని తాము నమ్ముతున్నామన్నారు. ఐఐటీ ఢిల్లీలోని ఫౌండేషన్ ఫర్ ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ ట్రాన్స్‌ఫర్‌లో నేషనల్ కోఆర్డినేటర్ విజేంద్ర కుమార్ విజయ్ మాట్లాడుతూ… లార్డ్స్ మార్క్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, ఉన్నత్ భారత్ అభియాన్ అండ్ ఎఫ్ఐఐటీ మధ్య సహకారం హెల్త్‌కేర్ యాక్సెస్‌ను ప్రజాస్వామ్యీకరించాలనే సామూహిక లక్ష్యంలో గణనీయమైన పురోగతిని సూచిస్తుందన్నారు. సమీప భవిష్యత్తులో భారతదేశ వైద్య మౌలిక సదుపాయాలపై పరివర్తనాత్మక ప్రభావాన్ని తాను అంచనా వేస్తున్నానన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement