Thursday, May 2, 2024

హ‌రిత హోట‌ల్స్ అంబాసిడ‌ర్ గా హ‌రిక‌…

హైదరాబాద్‌, : తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ (టీఎస్‌ టీడీసీ) బ్రాండ్‌ అంబాసి డర్‌గా బిగ్‌బాస్‌ ఫేం హారిక నియమాకం వివాదా స్పద మవడంతో పర్యాటక శాఖ ఈ మేరకు స్పష్టతనిచ్చింది. హారికను పర్యాటక అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నడిచే హరిత హోటళ్ల ప్రమోషన్‌ కోసం మాత్రమే నియమించినట్లు ఒక ప్రకటన విడుదల చేసింది. హారికను టూరిజం శాఖ బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమిస్తున్నట్లు ప్రకటించిన టీఎస్‌ టీడీసీ చైర్మన్‌ ఉప్పల శ్రీనివాస్‌ గుప్తా ఆమెకు నియామక పత్రాన్ని కూడా అందించిన విషయం తెలిసిందే. పర్యాటక మంత్రికి, ఉన్నతాధికారులకు సంబంధం లేకుండా ఈ నియామకం జరిగినట్లు ప్రచారం జరగడంతో వివాదం రాజుకుంది. దీనిపై ప‌ర్యాట‌క శాఖ వివ‌ర‌ణ ఇచ్చింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement