Monday, April 29, 2024

Misbehavior: భర్త వెకిలి చేష్టలు.. చెంప చెల్లుమ‌నిపించిన‌ భార్య

భ‌ర్త చేసిన ప‌నికి భార్య అత‌ని చెంప చెల్లుమ‌నిపించింది. ర‌ద్దీగా ఉన్న ప్రాంతంలో మ‌హిళ‌ల‌ను తాకుతూ అసభ్యంగా ప్ర‌వ‌ర్తించాడు ఓ భ‌ర్త‌. అది కాస్తా ఆక‌తాయిల పై నిఘా పెట్టిన పోలీసుల కంట ప‌డింది. ఇంకేముంది పోలీస్ స్టేష‌న్‌కు తీసుకెళ్లి త‌న బండారాన్ని భార్య ముందు బ‌ట్ట‌బ‌య‌లు చేశారు.

అస‌లు ఏం జ‌రిగిందంటే.. హైదరాబాద్‌లోని నాంపల్లిలో జరుగుతున్న ఎగ్జిబిషన్ (నుమాయిష్)కు వచ్చిన ఓ వ్యక్తి రద్దీగా ఉండడంతో మహిళలను అసభ్యంగా తాకుతూ ఆనందం అనుభవించసాగాడు. మఫ్టీలో ఉన్న పోలీసులు ఈ ఘటనను మొత్తం రహస్యంగా రికార్డు చేశారు. ఆపై అతడిని అదుపులోకి తీసుకుని బేగంబజార్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అనంతరం అతడి భార్యకు సమాచారం అందించి పిలిపించారు. అతడు చేసిన నిర్వాకాన్ని వివరించడంతోపాటు రికార్డు చేసిన వీడియోను ఆమెకు చూపించారు. అంతే, అది చూసిన ఆమె ఆగ్రహంతో ఊగిపోయింది. అందరి ముందు భర్త చెంప చెళ్లుమనిపించింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement