Friday, May 10, 2024

గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 2, శ్లోకం 30
30
దేహీ నిత్యమవధ్యో యం
దేహే సర్వస్య భారత |
తస్మాత్‌ సర్వాణి భూతాని
న త్వం శోచితుమర్హసి ||

తాత్పర్యము : ఓ భరతవంశీయుడా ! దేహమందు వసించు దేహి ఎన్నడును చంపబడడు. కావున ఏ జీవిని గూర్చియు నీవు దు:ఖించుట తగదు.

భాష్యము : శ్రీ కృష్ణుడు ఆత్మ జ్ఞానమును ముగిస్తూ ఆత్మ శాశ్వతమైనదని, శరీరము అశాశ్వతమని నిర్థారించెను. కాబట్టి అర్జునుడు తాతగారైన భీష్‌ముడు మరియు గురువుగారైన ద్రోణుడు సంహరింపబడతారని భయపడి తన క్షత్రియ ధర్మ నిర్వహణలో వెనుకంజ వేయరాదు. శ్రీ కృష్ణుడి వాక్కు మేరకు శరీరమునకు అతీతముగా ఆత్మ ఉందని విశ్వసించాలి. అంతేకాని ఆత్మ అంటూ ఏమీ లేదని ప్రోత్సహించరాదు. అలా అని యుద్ధ సమయములో అవసరమైనపుడు దానిని ఉపయోగించుటనూ మానరాదు. అయితే ఎప్పుడు హింస అవసరము అనేది మన ఇష్టానుసారాము కాకా భగవంతుడు ఆదేశమును ఇచ్చినప్పుడు మాత్రమే వినియోగించవలెను.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement