Monday, April 29, 2024

High Speed – ఔటర్ రింగ్ రోడ్డు పై వాహనాల వేగ పరిమితి 120కిమీ కి పెంపు

హైదరాబాద్ లోని ఔటర్ రింగ్ రోడ్డు పైన వాహనాల ప్రయాణ వేగ పరిమితిని పెంచారు.. ఇప్ప‌టి వ‌ర‌కు గంట‌కు 100 కిలో మీట‌ర్ల వేగానికి ప‌రిమితం కాగా ఇప్పుడు తాజాగా 120 కిలోమీట‌ర్ల‌కు పెంచారు.. ఈ మేర‌కు హెచ్ఎండీఏ ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ వెల్లడించారు.

ఔటర్ రింగ్ రోడ్డు పైన ప్రయాణికుల భద్రతకు మరిన్ని చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. కాగా, భద్రతాపరమైన అంశాలపై మంత్రి కేటీఆర్ సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. అలాగే ఔటర్ రింగ్ రోడ్డు పై భ‌ద్ర‌త ప్ర‌మాణాల విష‌యంలో రాజీ ప‌డ‌వ‌ద్ద‌ని అధికారుల‌కు కెటిఆర్ సూచించారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement