Monday, May 6, 2024

కెప్టెన్ మిల్లర్ ఫస్ట్ లుక్ రిలీజ్ డేట్ ఫిక్స్.. ప్ర‌క‌టించారు మేక‌ర్స్

ధనుష్ ప్రధాన పాత్రలో అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వం వహించిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా కెప్టెన్ మిల్లర్. సత్యజ్యోతి ఫిలింస్ నిర్మిస్తున్న‌ ఈ మూవీ నుండి కొంతకాలంగా ఎలాంటి అప్‌డేట్‌లు లేకపోవడంతో ధనుష్ అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. కాగా, ధనుష్ అభిమానులందరికీ గుడ్ న్యూస్ చెబుతూ ఒక అప్డేట్ ని ప్ర‌క‌టించారు మూవీ మేక‌ర్స్.

ఈ నెల (జూన్) 30 న మూవీ నుండి ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేయనున్నట్లు సోష‌ల్ మీడియా వేధిక‌గా ప్రకటించారు. అలాగే.. జూలైలో టీజర్‌ను విడుదల చేయనున్నట్టు స‌మాచారం. ఈ మూవీలో శివ రాజ్‌కుమార్, సందీప్ కిషన్, ప్రియాంక మోహన్, నివేదిత సతీష్, RRR ఫేమ్ ఎడ్వర్డ్ సోనెన్‌బ్లిక్ కీలక పాత్రలు పోషించారు. ఇక ఈ మూవీకి జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement