Sunday, April 28, 2024

High Court : మంత్రి గంగుల కమలాకర్‌ కు భారీ ఊరట

తెలంగాణ రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్‌ కు భారీ ఊరట లభించింది. ఆయన ఎన్నిక చెల్లదంటూ దాఖలైన పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. ఈసీ నిర్ధారించిన వ్యయానికి మించి గంగుల ఖర్చు చేశారని కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ హైకోర్టులో పిటిషన్‌ వేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్‌పై కోర్టు తాజాగా విచారణ జరిపింది. విచారణ సందర్భంగా ఇరువైపులా వాదనలు విన్న ధర్మాసనం.. సరైన ఆధారాలు లేవంటూ పిటిషన్‌ను కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది.

2018 ఎన్నికల్లో గంగుల పరిమితికి మించి ఎన్నికల ఖర్చు చేశారని పొన్నం ప్రభాకర్‌ పిటిషన్‌ వేసిన విషయం తెలిసిందే. ఆ ఎన్నికల్లో పిరమితికి మించి ఖర్చు చేశారని పిటిషన్‌లో పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement