Saturday, May 4, 2024

Rain Alert: మిచౌంగ్ ఎఫెక్ట్….తెలంగాణ‌లో ఇవాళ, రేపు భారీ వ‌ర్షాలు

తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. నేడు, రేపు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతీ భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని అధికారులు వెల్లడించారు. తుఫాన్ ప్రభావం ముఖ్యంగా ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

ఇక, భూపాలపల్లి, కరీంనగర్‌, పెద్దపల్లి, జనగామ, నల్లగొండ జిల్లాల్లో సైతం పలు చోట్ల భారీ నుంచి అతీ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఈ నేపథ్యంలో పలు జిల్లాలకు ఐఎండీ ఆరెంజ్‌ అలర్ట్‌ జారీచేసింది.
కాగా, జనగామ, ఆసిఫాబాద్‌, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజిగిరి, మెదక్‌, నాగర్‌కర్నూల్‌, వనపర్తి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. ఈ క్రమంలోనే ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ను జారీ చేసింది. గంటకు 30 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే ఛాన్స్ ఉందని తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement