Friday, May 3, 2024

వికారాబాద్ లో కుండపోత వర్షంతో రోడ్లన్నీ జలమయం

వికారాబాద్, ఆగస్టు 5 (ప్రభ న్యూస్): ఆకాశానికి చిల్లు పడిందా అనే విధంగా గత మూడు గంటలుగా వికారాబాద్ జిల్లా కేంద్రంలతో పాటు పరిసర మండలాల్లో భారీ వర్షం కురుస్తుంది. ఇటీవల కాలంలో కురిసిన భారీ వర్షాల్లో ఈ వర్షం అత్యధికంగా ఉండడంతో జన జీవనం పూర్తిగా స్తంభించింది. రోడ్లన్నీ పూర్తిగా నిర్మాణస్యంగా కనిపించాయి. ప్రధానంగా మూసి నది పొంగి ప్రవహిస్తున్నంతో వికారాబాద్, నవపేట్, శంకర్ పల్లి తదితర మండలాల్లో నదీ పరివాహక ప్రాంతాల్లో పంటలన్నీ పూర్తిగా నీట మునిగాయి

. వికారాబాద్ జిల్లా కేంద్రంలో రైల్వే స్టేషన్ బస్టాండ్ రోడ్డు ఆలంపల్లి రోడ్డు మద్గుల్ చిటెంపల్లి రోడ్డు ధన్నారం రోడ్డు పూర్తిగా నీటితో నిలిచిపోయాయి. రోడ్డు లోపల నిండి పొంగి ప్రవహిస్తుంది ధన వద్ద గల రోడ్డు వంతెన పూర్తిగా నీట మునిగింది. పోలీస్ రెవెన్యూ అధికారులు అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రాకూడదని హెచ్చరిస్తున్నారు

ఉదయం 4 గంటల నుండి ఏక దాటిగా వర్షం కురుస్తుండ టము తో రోడ్లన్నీ పూర్తిగా జలమయమయ్యాయి. జిల్లా కేంద్రంలో ఎక్కడ చూసినా వర్షంతో నిండిపోయింది. డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి. గత మూడు రోజులుగా వర్షాలు కురుస్తుండడంతో వ్యాపారాలు పూర్తిగా దెబ్బతిన్నాయని వ్యాపారస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత నెల రోజులుగా పూర్తిగా వర్షాలు పడక రైతన్నలు వర్షం కోసం ఎదురుచూడగా ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాలతో పంటలు నాశనమైతన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement