Wednesday, May 22, 2024

నిండుకుండలా లోయర్ మానేరు డ్యామ్ – వరద తీవ్రతతో గేట్లు ఎత్తివేసే అవకాశం

.తిమ్మాపూర్ సెప్టెంబర్ 5 ప్రభ న్యూస్.గత రెండు రోజుల నుండి ఎడతెరిపిలేని వర్షం కురుస్తుండడంతో వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. మండలంలోని చెరువులు జలకళను సంతరించుకుని మత్తల్లు పొంగి పోర్ల్లి మోయా తున్న వాగు లో అధిక నీరు ప్రవహిస్తోంది కురుస్తున్న వర్షాలకు కుంటలు  చెరువులు మత్తడి పడి  మానేరు డ్యాం లోకి వరద నీరు ఉప్పొంగుతుంది. కాకతీయ కెనాల్ నుంచి 3 వేల కృసెక్కులనీరు బయటకు పోతుంది.   మిడ్ మానేరు నుంచి లోయర్ మానేర్ కు 25584వేల క్యూసెక్కుల నీరు గంట గంటకు వరద ఫ్లో పెరుగుతూ వస్తుంది. ప్రస్తుతం లోయర్ మానేరు డ్యాం 20.700 టిఎంసిలు నిరు ఉంది.లోయర్ మానేరు డ్యామ్ కెపాసిటీ 24 టిఎంసిలు.మిడ్ మానేరు నుంచి వరద  పెరుగుతున్న క్రమంలో గేట్లు ఏ సమయంలో నై న ఏతే అవకాశం ఎస్ ఆర్ ఎస్ పి ఎస్ అధికారులుతేలిపారు.

కావున వాగు వద్దకు మత్స్యకారులు ప్రజలు వెళ్లకూడదు అధికారులు కోరుతున్నారు. లోయర్ మానేరు డ్యామ్ గేట్లు కొద్దీ గంటల లో ఎత్తి వేత.. పోలీస్,రెవెన్యూ అధికారులకు మరియు ప్రజప్రతినిధులకు తెలియజేయునది ఏమనగా .లోయర్ మానేరు డ్యామ్ ఎగువ పరివాహక ప్రాంతాలలో మరియు ఉత్తర తెలంగాణాలో అతిభారీ వర్ష సూచన కారణంగా ఏక్షణం లోనైనా ప్రాజెక్ట్ వరద గేట్లు ఎత్తి, నీటిని దిగువకు వదిలే అవకాశం ఉన్నది .కావున రెవిన్యూ మరియు పోలీస్ శాఖ అధికారులు తగు ముందు జాగ్రత్త చర్యలు తీసొకొవలసిందిగా మరియు గ్రామాలలో దండోరా వేయించాల్సిందిగా విజ్ఞప్తి. నదీ పరివాహక ప్రాంతం లోకి పశువులు గాని ,గొర్రెలు మొదలగునవి వెళ్లకుండా అలాగే చేపలు పట్టేవారు, గొర్రె కాపరులు మరియు రైతులు వెళ్లకుండా అప్రమత్తం గా ఉండవలెనని కోరుతున్నాము.

లోయర్ మానేరు జలాశయం దిగువ పరివాహక ప్రాంతాల గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయవలసిందిగా పోలీస్,రెవెన్యూ అధికారులలు ప్రజలను అప్రమత్తం చేయాలని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement