Tuesday, May 21, 2024

తెలంగాణలో నేడు అక్కడక్కడ భారీ వర్షాలుంటయ్​..​

తెలంగాణలో నేడు అక్కడక్కడ భారీగా, రేపు ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

శ్రీలంక సమీపంలో కొమరీన్ ప్రాంతంపై బంగాళాఖాతంలో అల్పపీడనం ఆవరించి ఉందని, దీని నుంచి తమిళనాడు తీరం వరకు గాలులతో కూడిన ఉపరితల ద్రోణి ఏర్పడిందని అధికారులు తెలిపారు.

ఈ గాలుల ప్రభావంతో నేడు తెలంగాణలో భారీ వర్షాలు కురవడంతోపాటు రేపటి నుంచి మూడు రోజులపాటు ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. రాష్ట్రంలో నిన్న 109 ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. జనగామ జిల్లా కోలుకొండలో అత్యధికంగా 7.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement