Sunday, May 5, 2024

Warangal: ఉరుములు మెరుపులతో భారీ వర్షం… తీవ్ర నష్టం

వరంగల్: వర్ధన్నపేట నియోజకవర్గ పరిధిలో ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు తీవ్రనష్టం ఏర్పడింది. సోమవారం సాయంత్రం మొదలైన ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం ఎడతెరిపి లేకుండా కురుస్తూనే ఉంది. దీంతో వాగులు, వంకలు
పొంగిపొర్లుతున్నాయి. ఇళ్లల్లోకి వరద నీరు చేరడంతో ప్రజలకు ఆటంకంగా మారింది. వర్ధన్నపేట ఆకేరు వాగు వద్ద వరద ప్రవాహం పెరిగి గతంలో ఉన్న పాత బ్రిడ్జి నిర్మాణం కూలిపోయింది. అ బ్రిడ్జి పై నుండి వేసిన మిషన్ భగీరథ పైప్ లైన్ ధ్వంసమై త్రాగునీరు వృధాగా వరద నీటిలో కలిసిపోతుంది.

గ్రామాలు, తండాల సమీపంలో ఉన్న కుంటలు నీటి ప్రవాహం పెరిగి జలమయంగా మారాయి. ఐనవోలు మండలం పంతిని గ్రామ శివారులోని వరంగల్ – ఖమ్మం ప్రధాన రహదారిపై వరదనీరు రోడ్డుపైకి రావడంతో ఇరువైపులా వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. దీంతో రాకపోకల మధ్య అంతరాయం ఏర్పడి ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. వరద ప్రవాహంతో ఐనవోలు మండలం కొండపర్తి గ్రామ శివారులో ఆ గ్రామం నుండి వెంకటాపురం, నర్సింహులపేట వెళ్లే రహదారి దాదాపు 2 కిలోమీటర్ల వరకు ధ్వంసమైపోయింది. అక్కడక్కడ నివాసపు ఇళ్లు, చెట్లు కూలిపోయాయి. అప్రమత్తమైన గ్రామపంచాయతీలు, పోలీసు అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement