Sunday, April 28, 2024

Health Bulletin – నిలకడగా తమ్మినేని వీరభద్రం ఆరోగ్యం… ఐ సి యు లో చికిత్స

హైదరాబాద్ – సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోగ్య పరిస్థితిపై ఏఐజీ వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. తమ్మినేని వీరభరం గుండె, కిడ్నీ, ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్నారని వైద్యులు వివరించారు.

అయితే ఊపిరితిత్తుల్లోని నీటిని బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నామని వైద్యులు వెల్లడించారు. తమ్మినేని వీరభద్రం ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు. నిన్నటితో పోలిస్తే బీపీ లెవెల్స్ నార్మల్ కి చేరుకుంటున్నాయన్నారు. లంగ్స్ లో నీరునీ వైద్యులు తొలగిస్తున్నట్లు వెల్లడించారు. ICU లో వెంటిలేటర్ సహాయంతో కృత్రిమ శ్వాస అందిస్తున్నారు. మెడిసిన్ కి తమ్మినేని రెస్పాండ్ అవుతున్నారని, ఇవ్వాళ ఆరోగ్యం స్టేబుల్ గా ఉంటే వెంటిలేటర్ తొలగించే అవకాశం అంటుంది తెలిపారు..

ఖమ్మంలో తమ్మినేనికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉందని, వెంటిలేటర్ సపోర్టుతో ఆస్పత్రికి తీసుకొచ్చారని వైద్యులు పేర్కొన్నారు. తమ్మినేని గుండె, కిడ్నీ, ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్నారని పేర్కొన్నారు. ప్రస్తుతం మందులతో చికిత్స అందిస్తున్నామని ఏఐజీ వైద్యులు వెల్లడించారు. క్రిటికల్ కేర్ నిపుణులు, కార్డియాలజిస్టులు, ఎలక్ట్రోఫిజియాలజిస్టులు, నెఫ్రాలజిస్టులు మరియు పల్మోనాలజిస్టులతో కూడిన మల్టీడిసిప్లినరీ బృందం డాక్టర్ సోమరాజు, డాక్టర్ డిఎన్ కుమార్ మార్గదర్శకత్వంలో తమ్మినేనికి చికిత్స సాగుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement