Monday, May 6, 2024

Health and Wealth – 6న సిద్దిపేటలో హాఫ్ మారథాన్ – అందరూ తరలి రావాలని మంత్రి హారీష్ రావు పిలుపు..

(ప్రభ న్యూస్ ఉమ్మడి మెదక్ బ్యూరో) –

మరో అద్భుత కార్యక్రమానికి సిద్దిపేట వేదిక కానుంది. ఇప్పటికే ఎన్నో కార్యక్రమాలతో అందరి దృష్టి సిద్దిపేట పై పడగ ఆగస్టు 6న రంగనాయక్ సాగర్ వేదిక హాఫ్ మారథాన్ నిర్వహిస్తున్నారు. సిద్దిపేట రన్నరప్స్ ఆధ్వర్యంలో సిద్దిపేట పోలీసుల సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఇప్పటికే ఏర్పాట్లు సాగుతున్నాయి. రంగనాయక్ సాగర్ చూడముచ్చటగా-ఆహ్లాదకరంగా ఉండటంతో ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు రంగ నాయక్ సాగర్ ను తిలకించేందుకు వస్తున్నారు. హాఫ్ మారథాన్ కార్యక్రమం రంగనాయక్ సాగర్ వేదికగా జరుగనుండటంతతో ప్రపంచ వ్యాప్తంగా రంగనాయక్ సాగర్ పేరు మరోమారు మారుమ్రోగనుంది.

రాష్ట్ర వ్యాప్తంగా తరలి రావాలి: మంత్రి హరీష్ రావు
సిద్దిపేట మరీ కార్యక్రమనికి వేదిక కనుండటం సంతోషంగా ఉంది. ఆగస్టు 6 న రంగనాయక్ సాగర్ వేదికగా హాఫ్ మారథాన్ నిర్వహిస్తున్నారు. కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా రన్నరర్స్, యువత, విద్యార్థులు తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది. రన్నింగ్- వాకింగ్ పై ప్రజలు పూర్తి అవగాహన కలిగి ఉండాలి. ప్రతి ఒక్కరూ రన్నింగ్, వాకింగ్ చేసి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement