Monday, April 29, 2024

Harish Rao : కాంగ్రెస్‌, బీజేపీ పాలిత ప్రాంతాల్లో మోట‌ర్ల‌కు మీటర్లు పెట్టారా ?.. మంత్రి హరీశ్ రావు

ఇన్నాళ్లు బీజేపీ నాయకులు అబద్దాలతో అదరగొట్టే ప్రయత్నం చేస్తే…కేంద్ర మంత్రి సీతారామన్ అసలు నిజాలను కుండ బధ్దలు కొట్టారని రాష్ర్ట మంత్రి హరీష్రావు స్పష్టం చేశారు. సిద్ధిపేటలో బుధవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఓట్ల కోసం తెలంగాణ బీజేపీ నాయకులు, ఏం ముఖం పెట్టుకొని తిరుగుతారని . ఈటల రాజేందర్, రఘునందన్, అరవింద్ ఎలా ఓట్లు అడుగుతారని హరీష్ రావు ప్రశ్నించారు. .

మోటార్లకు మీటర్లు పెట్టేది లేదని అని కరాఖండీగా అసెంబ్లీలో తెలంగాణ సీఎం కేసీఆర్ ఎదురొడ్డారని, కానీ తాము ఎట్టి పరిస్థితిలోనూ మీటర్లు పెడతామని కేంద్ర మంత్రి నిర్మలా తేల్చి చెప్పారని, ఈ విధంగా బీజేపీ సహా కాంగ్రెస్ బండారాన్ని బయటపెట్టారని, ఈ దేశంలో అనేక రాష్ట్రాలు మోటార్లకు మీటర్లు పెడుతున్నాయి, తెలంగాణ పెట్టలేదు కాబట్టి డబ్బులు ఇవ్వలేదని నిర్మలా స్పష్టంగా చెప్పారని, హరీష్ రావు వివరించారు.
12 రాష్ట్రాల్లో ఇప్పటికే మీటర్లు పెట్టారు, మరికొన్ని రాష్ర్టాలు దరఖాస్తు చేశాయ, ఇక్కడ కేసీఆర్ ఉండ బట్టే మోటార్లకు మీటర్లు ఇక్కడ సాధ్యం కాలేదని, రైతుల పక్షాఒక్క కేసీఆరే నిలబడ్డారని హరీష్ వివరించారు. మీటర్లు పెట్టటానికి కాంగ్రెస్ పాలిత రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక ప్రభుత్వాలూ అంగీకరించాయని, తెలంగాణలోనూ గెలిస్తే ఇక్కడ కూడా మీటర్లు పెడతారని హరీష్రావు ఆందోళన వ్యక్తం చేశారు.
అయిదు గంటలు కరెంట్ ఇస్తున్నామని కర్ణాటక డిప్యూటీ సీఓం శివకుమార్ బట్టబయలు చేశారని, దీని బట్టే కాంగ్రెస్, బీజేపీ రెండు పార్టీలూ రైతుల పాలిత శత్రువులని అర్థమవుతోందని హరీష్రావు అన్నారు. యూపీఏ వేసిన స్వామినాథన్ కమిటీని బీజేపీ ప్రభుత్వం తుంగలో తొక్కిందని, మోడీ గెలవగానే అమలు చేస్తాం అని చెప్పి మోసం చేశారని, స్వామినాథన్ కమిటీ నివేదిక అమలు కోసం కాంగ్రెస్ ఏనాడైనా పోరాటం చేసిందా? ఈ రెండు పార్టీలు రైతులను దగా చేశాయని హరీష్రావు తీవ్రంగా విమర్శించారు.


బీజేపీ పాలిత యూపీ, అస్సాం, మణిపూర్ లో మీటర్లు పెట్టారు. ఇండియా కూటమి తమిళనాడు, బెంగాల్, కేరళ లోనూ , బీజేపీ, కాంగ్రెస్ తో సంబంధం లేని ఎపీ, మేఘాలయ రాష్ర్టాల్లోనూ మీటర్లు పెట్టారు. కానీ చావనన్న చస్తాను కానీ మెటార్లకు మీటర్లు పెట్టే ప్రసక్తి లేదని భీష్మించిన ఏకైక రాష్ర్టం, సీఎం కేసీఆర్ మాత్రమేనని హరీష్రావు వివరించారు. 69 లక్షల రైతుల ప్రాణాలు ముఖ్యం, రూ. 25 వేల కోట్లు తెలంగాణ ప్రభుత్వానికి ముఖ్యం.చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నా, కాంగ్రెస్ కు ఓటు వేస్తే బాయిల కాడ మీటర్లు పెట్టేందుకు అంగీకరించినట్లే అని హరీష్రావు వివరించారు.
సాక్ష్యాధారాలతో మాట్లాడుతున్నా.. ఎవరు వస్తరో రండి చర్చకు సవాల్. రైతును నిలబెట్టింది కేసీఆర్, ఇప్పుడు కేసీఆర్ ను రైతులు నిలబెట్టాలి అని హరీష్రావు ఉద్వేగంతో అన్నారు.
2014లో తెలంగాణ తలసరి ఆదాయం రూ. 1,24,104 ఉండగా 2023లో రూ.3,17,117 కు పెరిగింది. అంటే రెండున్నర రెట్లు పెరిగింది వాస్తవం కాదా. ? 2014లో 10వ స్థానంలోని తెలంగాణ ఇప్పుడు మొదటి స్థానానికి ఎదిగింది. సీఎం కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో చేసిన కృషి వల్ల సాధ్యమైంది. దీనిని ఎందుకు ఒప్పుకోరు?. ఇదే సమయంలో దేశ తలసరి ఆదాయం రూ.1,72,000 మాత్రమే. అంటే తెలంగాణ కన్నా రూ.1,45,000 ఎక్కువ. మీ అసమర్థతను ఎందుకు ఒప్పుకోలేదు? అని హరీష్రావు ప్రశ్నించారు. అప్పుల గురించి కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు చెప్పడం నిజంగా సిగ్గుచేటు. 2014లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చేనాటికి దేశం మీద ఉన్న అప్పు దాదాపు రూ.55 లక్షల కోట్లు. ఇప్పుడు రూ.155 లక్షల కోట్లు దాటింది. అంటే ప్రతి నెల దాదాపు లక్ష కోట్లు అప్పు చేసిన ఘనత మీది. మీరు వచ్చి మాకు చెప్పడం గురువింద సామెతను గుర్తు చేస్తోంది. అప్పులు తగ్గిస్తున్నామని పచ్చి అబద్ధాలు చెప్పడం బాధాకరం అని హరీష్రావు తీవ్రంగా బీజేపీని విమర్శించారు.
కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నివేదిక ప్రకారమే.. జీఎస్టీపీలో తెలంగాణ అప్పుల వాటా 28 శాతం మాత్రమే. ఇదే సమయంలో దేశ జీడీపీలో 57 శాతం అప్పులు చేసి దేశాన్ని అప్పుల కుప్పగా మార్చిన ఘనత మీది కాదా?. రూపాయి విలువ తగ్గించిన ఘనత బీజేపీ దే, నిరుద్యోగ సమస్యలకు కారణం బీజేపీ దే, బీడీ కట్టల మీద పన్ను వేసింది బీజేపీయేనే, సిలిండర్ ధరను 400 నుంచి 1200 పెంచింది బీజేపీ కాదా? లక్షల టన్నుల వడ్లు పండితే నేడు మూడున్నర కోట్ల టన్నుల వడ్లు పండుతున్నాయి. పంజాబ్ దాటి అత్యధిక వడ్లు పండే రాష్ట్రంగా తెలంగాణ రైతులు ఎదిగారు, కర్ణాటక నుంచి లిక్కర్, లీడర్లు వస్తున్నారు..బియ్యం మాత్రం మనం పంపుతున్నాం అని హరీష్రావు వివరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement