Monday, April 29, 2024

పరుగు పట్టుదలకు ‘ హ్యాట్సాఫ్..

సిద్దిపేట ప్రతినిధి :- హాఫ్ మారథాన్ గొప్ప కార్యక్రమం అని .ఇందులో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలంటూ స్పూర్తి నింపిన శ్రీకాంత్ ను మంత్రి హరీష్ రావు అభినందించారు. సిద్దిపేట జిల్లా కోమరవేళ్లి మండలం నాగపూరి గ్రామానికి చెందిన తాడూరి శ్రీకాంత్ సిద్దిపేట రంగనాయక సాగర్ వద్ద ఈ నెల 6వ తేదీన జరిగే హాఫ్ మారథాన్ లో పాల్గొనడానికి సికింద్రాబాద్ నుండి రంగనాయక సాగర్ వరకు శ్రీకాంత్ తన బృందం తో రన్నింగ్ చేస్తూ హాఫ్ మారథాన్ కు స్పూర్తి నింపారని మంత్రి హరీష్ రావు అన్నారు.. తానే హాఫ్ మారథాన్ బ్రాండ్ అంబాసిడర్ అని మంత్రి హరీష్ రావు తన పట్టుదలకు ప్రశంసించారు…శ్రీకాంత్ ను స్పూర్తిగా తీసుకొని యువకులు 6న రంగనాయక సాగర్ వద్ద జరిగే హాఫ్ మరాథాన్ లో పెద్ద ఎత్తున పాల్గొని మరో సారి మన సిద్దిపేట ఖ్యాతి నలుదిశలా చాటి చెప్పాలి అని మంత్రి పిలుపునిచ్చారు..

రన్నింగ్ అనేది మన లో ఒక దిన చర్య గా మారాలి అని సిద్దిపేట పోలీస్ క‌మిష‌న‌ర్ శ్వేత పిలుపు ఇచ్చారు.. సిద్దిపేట రన్నర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న హాఫ్ మారథాన్ కార్యక్రమానికి శ్రీకాంత్ ఎంతో ఉత్సహాన్ని నింపారు అని అన్నారు .

Advertisement

తాజా వార్తలు

Advertisement